హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad: హానీమూన్ కోసం వెళ్లి.. గుండె పోటుతో మృతి చెందిన సాఫ్ట్ వేరు ఉద్యోగి..

హానీమూన్ కోసం విదేశాలకు వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు.

|
Google Oneindia TeluguNews

ఆరు నెలల కింద పెళ్లి చేసుకున్నారు. సరదా గడుపుదామని విదేశాలకు వెళ్లారు. కానీ విధి వారిద్దరిని వేరు చేసింది. భర్తను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఎల్బీనగర్ నాగోల్ అజేయ్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీంతో కటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ నాగోల్ డివిజన్ అజేయ్‌నగర్ కాలనీలో రాముని రవీందర్ విజయలక్ష్మి దంపతుల కుటుంబం నివాసం ఉంటుంది. రవీందర్ అల్కపురి చౌరస్తాలో హోటల్ నిర్వహిస్తాడు. రవీందర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూమారై ఉన్నారు. చిన్న కూమారుడు వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

వంశీకృష్ణ(27) కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో గతేడాది జూన్ 23న పెళ్లి జరిగింది. వంశీ కృష్ణ ఈ నెల 13న భార్య శ్రావణితో కలిసి హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లారు. ఈ జంట 22వ తేదీన ఉదయం సరదాగా గడిపేందుకు బాలిలోని పెన్నిడా ఐలాండ్‌ కు వెళ్లారు.
ఉదయం 20 మంది పర్యాటకులతో కలిసి పెన్నిడా ఐలాండ్‌ సముద్ర భాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు వెళ్లారు. వంశీ స్కూబా డైవింగ్ చేయాలనుకున్నాడు.

A software employee who went abroad for honeymoon died of heart attack

ఆక్సిజన్‌ మాస్క్‌, డైవింగ్‌ షూస్‌ అన్నీ పెట్టుకొని గైడ్‌లతో సముద్రంలోకి దిగాడు. కానీ అంతలోనే సముద్రంలో గల్లంతయ్యాడు.
అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు. డైవింగ్ చేసినప్పుడు అతడికి హార్ట్ స్ట్రోక్ చనిపోయినట్లు తెలుస్తోంది. వంశీ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపు సాయంత్రానికి వంశీ మృతదేహం హైదరాబాద్‌కి చేరుకోనున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

వంశీ గ్రూప్‌-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి,మెయిన్స్‌ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. నిజానికి పెన్నిడా ఐలాండ్‌ నుంచి ఆదివారమే తిరిగి వంశీ కృష్ణ బాలికి వచ్చేయాల్సి ఉంది కానీ. అక్కడి గైడ్‌ సముద్రంలోపలకి వెళితే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుందని పదే పదే చెప్పడంతో సముద్రలోకి దిగాడు.

English summary
They got married six months later. They went abroad to have fun. But fate separated them. She took her husband to the worlds of no return. This incident took place in LB Nagar Nagol Ajay Nagar Colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X