హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యంమత్తులో ర్యాష్ డ్రైవింగ్.. విద్యార్థి మృతి.. మాదాపూర్ ఘటనలో ముగ్గురు సీరియస్

|
Google Oneindia TeluguNews

చదువుకునే విద్యార్థులను నిత్యం కాపాడుకోవాల్సిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అవసరానికి మించి అన్ని సౌకర్యాలను కల్పించడంతో యువతి యువకులు భవిష్యత్‌పై ఎలాంటీ లక్ష్యం లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్న విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం మత్తు ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా తయారైంది. వివరాల్లోకి వెళితే..

హైస్పీడ్ డ్రైవింగ్‌తో మరో విద్యార్థి మృతి

హైస్పీడ్ డ్రైవింగ్‌తో మరో విద్యార్థి మృతి

హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు పార్టీ చేసుకునేందుకు మాదాపూర్‌లోని పబ్‌కు చేరుకున్నారు. నలుగురిలో స్నేహితుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. పబ్‌లో అర్థరాత్రి వరకు నలుగురు విద్యార్థులు జల్సా చేశారు. తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో దారుణమైన ఈ ప్రమాదానికి గురయ్యారు. మద్యం ప్రభావంతో అతివేగంగా వస్తున్న కారు మాదాపూర్‌లోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపు తప్పింది.

పార్టీకోసం పబ్‌కు చేరుకున్న విద్యార్థులు

పార్టీకోసం పబ్‌కు చేరుకున్న విద్యార్థులు

మాదాపూర్ మెట్రో డివైడర్‌ను ఢికొట్టిన అనంతరం స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాద ఘటనలో మనీష్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారు డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థితోపాటు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి కారులోని బెలున్‌లు తెరుచుకోవడం వల్ల స్వల్పగాయాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది.

అదుపుతప్పి ప్రమాదం

అదుపుతప్పి ప్రమాదం

అయితే కారు వెనక సీట్లో కూర్చున్న మనీశ్‌ మరియు ఐశ్యర్య అనే తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మనీష్, ఐశ్వర్యను ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలపాలైన మనీశ్‌ మార్గమధ్యంలోనే మృతి చెందారు. ప్రమాద సంఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం మద్యమా... లేక ఓవర్ స్పీడ్ అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

English summary
a student dead and three other were injured in car accident because of rash driving at madhapur metro station in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X