హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కూటీపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: టీసీఎస్ మహిళా ఉద్యోగి మృతి, డ్రైవర్‌ను చితకబాదారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మహిళ తలపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

TSRTC Strike: కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదు: ఆర్టీసీ ఎండీ హెచ్చరికTSRTC Strike: కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదు: ఆర్టీసీ ఎండీ హెచ్చరిక

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో..

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో..

నిర్లక్ష్యంగా బస్సు నడిపాడంటూ స్థానికులు తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాదారు. బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మృతురాలిని టీసీఎస్ ఉద్యోగి సోహిని సక్సేనా(26)గా గుర్తించారు.

అత్యంత వేగంగా..

అత్యంత వేగంగా..

మంగళవారం మధ్యాహ్నం సోహిని సక్సేనా మాసబ్ ట్యాంక్ నుంి బంజారాహిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె ముందు వెళుతుండగా ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఆమెపై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలోని డివైడర్‌ వద్ద ఉన్న స్తంభాన్ని ఢీకొంది.

భారీగా ట్రాఫిక్‌జాం

భారీగా ట్రాఫిక్‌జాం

మహిళ మృతదేహంతో స్థానికలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ప్రమాదం కారణంగా మాసబ్ ట్యాంక్-పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రిఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రైవేటు వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

Biodiversity Flyover Accident CCTV Footage Exclusive Visuals || Oneindia Telugu

బయో డైవర్సిటీ ప్రమాదం మరువకముందే..

ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాద ఘటన మరువకముందే నగరంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ప్లైఓవర్ పైనుంచి అతివేగంగా కారు కిందపడటంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో 9మంది గాయాలపాలయ్యారు.

English summary
A TCS woman employee died after rtc bus crushes her scooty in hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X