హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!

|
Google Oneindia TeluguNews

అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు కూడ ఇచ్చింది. అయినా తనకు న్యాయం జరగలేదు. మహిళను ఒంటరిని చేసి ఉన్న భూమిని ఆమే కొడుకులకు కట్టబెట్టారు అధికారులు. దీంతో కొపం నాశాలానికి ఎక్కిన ఓమహిళ వీఆర్వో గల్లా పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయానికి ఈడ్చుకువచ్చింది. అయితే బ్యాలన్స్ తప్పి క్రిందపడిపోయింది. తలకు గాయాలై ఆసుప్రతి పాలైంది.

ఎమ్మార్వో కార్యాలయంలోనే మహిళ ఘర్షణ

ఎమ్మార్వో కార్యాలయంలోనే మహిళ ఘర్షణ

తెలంగాణ రాష్ట్రంలోని భూచట్టాల్లో ఎన్ని మార్పులు తీసుకువస్తున్న ప్రజలు మాత్రం సరైన న్యాయం జరగడం లేదు. భూ సమస్యల్లో కీలక పాత్ర పోషించే రెవెన్యూ సిబ్బంది చేతివాటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో ఒకరికి చెందాల్సిన భూములు ఇంకోకరికి చెందుతున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే యోచనలో ఉన్న విషయం తెలిసిందే, ముఖ్యంగా రెవెన్యూ సిస్టమ్ లోని వీఆర్వోలు చూపిస్తున్న చేతివాటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లాలోని ఓ మహిళ వీఆర్వో గల్లాపట్టుకుని నిలదీసింది.

ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ఘటన

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ఘటన

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి తహాసీల్దార్ కార్యాలయం పరిధిలోని మేడికుందా గ్రామానికి చెందిన ఖాదిరాబాద్ బీర్‌గొండ అనే రైతుకు సంబంధించిన భూమిని ఆయన ముగ్గురు కొడుకులు పట్టా చేశారు. అయితే బీర్‌గొండకు పోచమ్మ అనే మూడో భార్య ఉంది. దీంతో పోచమ్మ తనకు భూమిలో వాటా రావాలని ఎమ్మార్వో ను కోరింది. ఈనేపథ్యంలోనే తన పేర కూడ కోంత పట్టా చేయాలని కార్యాలయం చుట్టు తిరుగుతోంది. పోచమ్మ అవసరాన్ని ఆసరా చేసుకున్న వీఆర్వో ఆమే నుండి డబ్బులు తీసుకున్నాడు. అయినా పని కాలేదు.

ఘర్షణలో గాయాలపాలైన మహిళ

ఘర్షణలో గాయాలపాలైన మహిళ

దీంతో విసుగు చెందిన పోచమ్మ నేడు వీఆర్వోతో వాగ్వావాదానికి దిగింది. ఈ నేపథ్యంలోనే వీఆర్వో గల్లా పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లింది. తనకు భూమి దక్కకుండా ఎందుకు చేశావని నిలదీసింది. దీనికి తోడు అడిగినన్ని డబ్బులు కూడ ఇచ్చానని ,కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయింది. అయితే ఘర్షణ జరుగుతున్న సంధర్భంలో కార్యాలయం మెట్లమీద నుండి క్రిందపడింది. దీంతో పోచమ్మ తలకు గాయమై సృహతప్పింది.

English summary
A woman clashed with a v.r.o and catch the shirt collar during a land issue. The incident took place on at the Vatpalli Tahsildar office in Sangareddy district,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X