నిండు ప్రాణం బలి.. 108 వల్లే, మొరాయించడంతో.. తప్పు ఎవరిదంటే
ఆపదలో ఉన్నప్పుడు కుయ్ కుయ్ అని వచ్చి ప్రాణాలు కాపాడేది 108 అంబులెన్స్. దివంగత వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సేవలు మరింత విసృతం అయ్యాయి. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడం.. మొరాయించడం జరుగుతుంటాయి. ఇప్పటికీ రాష్ట్రంలో అంబులెన్స్‌లు ఉన్నా.. వాటి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సమస్యలు తప్పడం లేదు.

ప్రాణం తీసిన అంబులెన్స్
108 అంబులెన్స్ వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చర్ల మండలం రాళ్ళాపురానికి చెందిన గుత్తికోయ మహిళ మాడవి చుకిడీ కుటుంబ సమస్యలతో గురువారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే ఆ విషయం వారు గమనించలేకపోయారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసి ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆలస్యం అయ్యింది.

ఆస్పత్రికి వస్తోండగా..
చర్లకు చెందిన 108 అంబులెన్స్ చుకిడీని తీసుకుని ఆస్పత్రికి వస్తోంది. మధ్యలో తాలిపేరు ప్రాజెక్ట్ శివారులో మొరాయించింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ తిరిగి స్టార్ట్ కాలేదు. దీంతో లేట్ అయ్యింది. చుకిడీని గ్రామస్ధులు ద్విచక్ర వాహానంపై ఎక్కించుకుని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.


విలపించిన ఫ్యామిలీ
చుకిడీ చనిపోయిందని చెప్పటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గత కొంతకాలంగా 108 వాహనం సరిగా పని చేయటం లేదు. విషయం చెబుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదట. అందుకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. సమస్య గురించి తాము అయితే వివరించామని సిబ్బంది చెబుతున్నారు. ఆఫీసర్స్ పట్టించుకోలేదని స్పష్టంచేశారు. తప్పు ఎవరిదయినా సరే.. కానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలయిపోయింది.