హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: మహిళ దారుణ హత్య: పెట్రోల్ పోసి నిప్పంటించారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె వయస్సు 35-45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మహిళను గురువారం రాత్రి హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

#Crime మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు
A woman killed in shamshabad in Hyderabad

రూ. 10 కోసం హత్య
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 1న జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. రూ. 10 కోసమే అతడ్ని హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ బాల నేరస్తుడు కూడా ఉండటం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి ఆరేళ్ల క్రితం వలసొచ్చిన మహ్మద్ షకీవ్ అలీ అలియాస్ షకీబ్ అలీ(34) కూకట్‌పల్లి తులసీనగర్ పరిధి కృష్ణవేణినగర్‌లో భార్యా పిల్లలతో ఉంటున్నాడు. ప్రగతినగర్ రోడ్డులోని అంబీర్ చెరువుకట్ట వద్ద తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. జనవరి న సాయంత్రం ఓ యువకుడు వచ్చి కిలో రూ. 30కి ద్రాక్ష కొన్నాడు. అయితే, రూ. 20 ఇచ్చి వాదనకు దిగాడు. వాగ్వాదం జరిగిన తర్వాత ఫోన్ చేసి తన స్నేహితులను పిలిపించాడు యువకుడు.

ఇనుప స్టాండ్‌తో వ్యాపారి కడుపులో బలంగా కొట్టి పారిపోయాడు. ఈ క్రమంలో మహ్మద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. జనవరి 3వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎల్లమ్మబండకు చెందిన మెకానిక్ నసీం అలియాస్(19), మహ్మద్ సమీర్ ఖాద్రి అలియాస్ షేక్ సమీరుద్దీన్(20), సయ్యద్ అప్సర్(20), మహ్మద్ ఖలీద్(19), మహ్మద్ తన్వీర్(18)లను నిందితులుగా గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. మైనర్ నిందితుడ్ని జువైనల్ హోంకి తరంలిచారు.

English summary
A woman killed in shamshabad in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X