హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: కరోనా మందంటూ తండ్రికి విషం తాగించి యువకుడు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అనేక విషాదాలను మిగులుస్తోంది. మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. మానవత్వాన్ని దూరం చేస్తోంది. కరోనా కారణంగా మనుషుల మధ్య దూరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రజలను ఈ మహమ్మారి పేదలుగా మార్చివేస్తోంది.

కరోనా మందంటూ..

కరోనా మందంటూ..


కరోనా మహమ్మారిని ఎదుర్కోలేని కొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా మిగిల్చిన ఆర్థిక నష్టాలను భరించలేక ఓ యువకుడు తన తండ్రికి కరోనా మందు అని చెప్పి పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత అతడు కూడా తాగాడు.

మూడు గ్లాసుల్లో విషం కలిపి..

మూడు గ్లాసుల్లో విషం కలిపి..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్ హిల్‌టాప్ కాలనీలో ఆలంపాటి అనీష్ రెడ్డి(35) తల్లిదండ్రులు ఆలంపాటి రామిరెడ్డి(61), శ్రావణిరెడ్డిలతో కలిసి నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అనీష్ రెడ్డి కరోనాకు మందు తెచ్చానంటూ తల్లిదండ్రులను నిద్రలేపాడు. మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు.

కొడుకు మృతి..

కొడుకు మృతి..


మొదటి గ్లాసు తండ్రికి ఇచ్చి, తర్వాత తానూ తాగాడు. వంటగదిలోనికి వెళ్లిన తల్లి వచ్చేలోపే తండ్రీకొడుకులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళనకు గురైన శ్రావణి.. స్థానికుల సహాయంతో వారిద్దరినీ సోమాజిగూడలోని కార్పొరేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్కువ మోతాదులో పురుగులమందు తాగిన అనీష్ రెడ్డి చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు.

తండ్రి పరిస్థితి విషమం..

తండ్రి పరిస్థితి విషమం..


ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అనీష్ రెడ్డి పలు ఐటీ కంపెనీలకు భోజనం సరఫరా చేస్తుంటాడని.. కొంత కాలంగా కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడం, వ్యాపారం ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని తల్లి పోలీసులకు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడివుంటాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్తానికంగా విషాదాన్ని మిగిల్చింది.

English summary
A youth commits suicide after poison drinking with father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X