హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్

|
Google Oneindia TeluguNews

తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ సమయంలో అనవసరంగా తిరగకుండా డ్రోన్స్ తో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా మరోమారు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలని అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంకా అంతే కాదు నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్‌, లైసెన్స్‌, ఆధార్‌ కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు.

సైబ‌రాబాద్ సీపీ సజ్జనార్‌ నేడు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్ లో పర్యటించారు . లాక్ డౌన్ అమలును పరిశీలించారు . రోడ్లపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Aadhaar is must .. people will be sued who breaks the lock down rules

ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్‌, లైసెన్స్‌, ఆధార్‌ కార్డు కూడా తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రెస్ ను బట్టి అతను ఎక్కడి వాడు ఎక్కడ తిరుగుతున్నారు అని అంచనా వేస్తామని చెప్పారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారికి 3 కిలోమీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలని కోరారు సీపీ స‌జ్జ‌నార్. అనవసరంగా తిరిగి అడ్డంగా బుక్ కావద్దని హితవు పలికారు.

English summary
Commissioner of the Cyberabad Commissionerate, V.C Sajjanar, said that don't break the lock down rules.If anybody violet the rules they will be punished severely . at the same time sajjanar said to bring adhar card, licence along with helmet when ever people wants to come out for daily essentials .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X