హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న ప్యారడైజ్... నేడు అభినందన్ హోటల్‌కు.. రూ. లక్ష జరిమాన

|
Google Oneindia TeluguNews

జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీల ద్వార హోటళ్లను హడలెత్తిస్తున్నారు. ఆహారపదార్ధాల్లో నాణ్యత లేకపోవడంతో పాటు, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వాటిపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. గురువారం ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆహారపదార్థాల్లో సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో లక్ష రుపాయల జరిమాన విధించగా. హోటల్ నిర్వాహాణపై వారంరోజుల్లో మార్పులు రాకపోతే తాళం వేస్తామని నోటీసులు జారీ చేశారు. అయితే బిర్యాణిలో వెట్రుక వచ్చిందని ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.

రెండో రోజు కూడ జీహెచ్‌ఎంసీ అధికారులు హోటళ్లలో తనీఖీలు చేపట్టారు. దీంతో ఎల్బీనగర్‌లోని పలు హోటళ్లోలో నిబంధనలు ఉల్లంఘన, ఆహారాపదార్థా నాణ్యతపై తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగానే అభినందన్ గ్రాండ్ హోటల్‌‌ యాజమాన్యం ట్రేడ్ లైసైన్స్‌ను రెన్యువల్ చేయకపోవడం, నిషేధిత ప్లాస్టిక్‌ను ఉపయోగించడంతో పాటు హోటల్‌ నుండి వచ్చే వ్వర్థపదార్థాలను డ్రైనేజీలోకి వదలడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో హోటల్ యాజమాన్యంపై లక్ష రూపాయల జరిమాన విధించారు.

abhinandan Hotel has been fined Rs.one lakh

గత రెండు రోజులుగా హోటల్ యజమాన్యాలపై చర్యలు చేపడుతుండడంతో వినియోగదారులు తమ అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్దపెద్ద హోటళ్లతోపాటు నగరంలోని పలు ఇతర చిన్న హోటళ్లు కూడ పరిశుభ్రమైన ఆహారపదార్థాలను పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో వారిపై ఎలాంటీ ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇతర హోటళ్లపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. హోటళ్లపై ఫిర్యాదులు లేకున్నా అధికారులు రోజువారిగా తనిఖీలు చేపట్టాలని ఆశిస్తున్నారు.

English summary
LB nagar abhinandan Hotel has been fined Rs.one lakh for poor maintenance. Officials have warned that the hotel will be closed if it is not corrected within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X