హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీసర నాగరాజుపై మరో కేసు: ఈసారి 4 రిజిస్ట్రేషన్లు, వ్యాల్యూ రూ.2.68 కోట్లు..

|
Google Oneindia TeluguNews

కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు గుర్తున్నారు.. కదా.. రూ.1.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సారి మరో అవనీతి కేసు నాగరాజును వెంటాడింది. పట్టా భూమి కోసం డబ్బులు అడిగిన విషయం వెలుగుచూసింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో కేసును నమోదు చేశారు.

2 కిలోల బంగారం, రూ.32 లక్షల క్యాష్, డాక్యుమెంట్స్.. కీసర నాగరాజు అక్రమాస్తులు రూ.150 కోట్లు..2 కిలోల బంగారం, రూ.32 లక్షల క్యాష్, డాక్యుమెంట్స్.. కీసర నాగరాజు అక్రమాస్తులు రూ.150 కోట్లు..

నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు..

నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు..

కీసర మండలం రాంపల్లిలో వేర్వేరు సర్వేనెంబర్లలో 24.16 ఎకరాల భూమికి సంబంధించి నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విలెన్స్‌ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో ఏసీబీ మరో కేసును నమోదు చేసింది. ఆ భూముల ఫైళ్లు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేసి, పాసు పుస్తకాలు జారీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దానిని విజిలెన్స్ అధికారులు నివేదించారు.

అంజిరెడ్డి బంధువు కావడంతో..

అంజిరెడ్డి బంధువు కావడంతో..

కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, స్థానిక రైతు కందడి ధర్మారెడ్డికి నాగరాజు పాసుపుస్తకాలు ఇచ్చాడు. లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అంజిరెడ్డికి ధర్మారెడ్డి సమీప బంధువు కావడం విశేషం. నలుగురికి పాసుపుస్తకాలిచ్చిన భూమి మొత్తం 24.16 ఎకరాలు అని తెలుస్తోంది. దీని విలువ 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.48.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

రూ.1.10 లక్షలకు డీల్

రూ.1.10 లక్షలకు డీల్


మరోవైపు రాంపల్లీ దయార వద్ద గల 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి మధ్యవర్తిత్వం చేశాడు. తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్ కుదుర్చాడు. శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి డబ్బులు సమకూర్చాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు చేసి వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..

రూ.కోటి 10 లక్షలు రియల్టర్‌ శ్రీనాథ్‌ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్‌ సహకరించాడన్న నేపథ్యంలో ‌శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. రియల్‌ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్‌ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. గుండ్ల పోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను ఆర్‌టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి వెల్లడించాడు.

English summary
acb officials file another case to nagaraju for bribe case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X