హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజలకు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ బారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలోనూ ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు. సెక్రటేరియట్ వ్యర్థాల తరలింపు కోసం రూ.15 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ సమయంలో సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆ 15 కోట్లతో పేదలకు కరోనా వైరస్ చికిత్స చేయించొచ్చు కదా అన్నారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అందుతోన్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అచ్చం దిష్టిబొమ్మల్లా మంత్రులు: కేసుల లెక్కల్లో తేడా: కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ గుస్సా..అచ్చం దిష్టిబొమ్మల్లా మంత్రులు: కేసుల లెక్కల్లో తేడా: కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ గుస్సా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఆరోగ్య శ్రీలో చేర్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. మరీ ఇక్కడ ఎందుకు చేర్చడం లేదన్నారు. పేదలు, మధ్య తరగతి వారు లక్షలకు లక్షలు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రిలో ఎలా వైద్యం చేయించుకుంటారని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం నిర్మాణంపై కేసులు ఉన్న నిర్మాణాలపై ప్రభుత్వం ముందడుగు వేయడం బాధాకరమన్నారు.

add coronavirus treatment in aarogya sri, bandi sanjay asks telangan govt

ఉస్మానియాను పునర్ నిర్మిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కానీ ముఖ్యమంత్రే కనిపించరు.. ఇక పేదల సాధక బాధకాలను పట్టించుకునేది ఎవరు అని సెటైర్లు వేశారు. ఉస్మానియా ఔట్ సోర్సింగ్ నర్సులు, పారిశుద్ద కార్మికులు బండి సంజయ్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.

English summary
add coronavirus treatment in aarogya sri. bjp president bandi sanjay ask telangan government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X