హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 గంటల్లో ఓటేసిన 25 మంది.. అదీ కూడా వృద్దులే.. కానరానీ యువత

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు కావస్తోంది. కొన్ని చోట్ల మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. మరికొన్ని చోట్ల ఓటు వేసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పాతబస్తీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అక్కడ ఓటింగ్ ఉదయం 10, 11 తర్వాత పుంజుకోనుంది. అప్పటివరకు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చేందుకు వయోజనులు అంతగా ఆసక్తి చూపించరు. ఇక పురానాపూల్, జియాగూడ, శాలిబండ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈ సారి కూడా పోలింగ్ మందకొడిగానే సాగుతోంది.

Recommended Video

GHMC Elections 2020: KTR Casts His Vote ! Oneindia Telugu
పురానాపూల్‌లో మందకొడిగా..

పురానాపూల్‌లో మందకొడిగా..

149వ డివిజన్ పురానాపూల్.. పాతబస్తీలో ఒక డివిజన్ కాగా.. ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. దీంతోపాటు ఘర్షణలు ఎక్కువగానే జరుగుతుంటాయి. గత ఎన్నికల్లో గొడవ జరగడంతో రీ పోలింగ్ కూడా నిర్వహించారు. అయితే ఈ పోలింగ్ స్టేషన్ వద్దకు కొద్ది మంది మాత్రమే వచ్చి ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు అంటే 2 గంటల్లో కేవలం 25 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వచ్చినవారు కూడా వృద్దులే కావడం విశేషం. అంటే యువత మాత్రం ఉదయం పూట కనిపించలేదు.

కానరానీ యువత..

కానరానీ యువత..

ఇక్కడ నైట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని.. అందుకే యువత ఉదయం రారని తెలుస్తోంది. 10, 11 గంటల నుంచి పోలింగ్ శాతం పెరుగుతుందని.. ఇదివరకు కూడా ఇలానే జరిగిందని చెబుతున్నారు. ఈ సారి కూడా అదేవిధంగా పోలింగ్ జరుగుతోందని అంచనాలు ఉన్నాయి. పాతబస్తీలో సమస్మాత్మకంగా ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసు సిబ్బందితోపాటు అదనపు బలగాలను కూడా మొహరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.

అదనపు బలగాల మొహరింపు

అదనపు బలగాల మొహరింపు

11 గంటల తర్వాత పోలింగ్ పెరగనుండగా.. గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగే చాన్స్ ఉంది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగేందుకు వీలుంది. ఇదివరకు కూడా జరగడంతో.. అదనపు బలగాలను మొహరించారు. కరోనా వైరస్ వల్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అప్పటివరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి కూడా ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. దీనిని బట్టి గ్రేటర్ పోలింగ్ పెరిగే ఛాన్స్ ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary
after 2 hours 25 members only cast vote in 149 purana pul division in ghmc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X