హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీక‌ర్ ప‌ద‌వీకాలం త‌ర్వాత ఇక విశ్రాంతే..! పోచారంతో పాటు మ‌రికొంద‌రికి పొలిటిక‌ల్ రిటైర్మెంట్..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ రెండో విడ‌త ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌‌విజ‌యం సాధించింది. అయితే ప్ర‌భుత్వ ప‌ద‌వులు అనుభ‌విస్తున్న కొంత మంది నేత‌ల‌కు ఇదే చివ‌రి అవ‌కాశంగా తెలుస్తోంది. వ‌యోభారం పైబ‌డ‌డంతో కొంత‌మంది నేత‌ల‌కు ఇప్ప‌టికే విశ్రాంతినివ్వ‌గా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మ‌రికొంత మంది రాజ‌కీయాల నుండి నిష్క్ర‌మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ శాస‌నస‌భ స్పీక‌ర్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసులు రెడ్డి ూడా ఈ టెర్మ్ త‌ర్వాత రాజ‌కీయాల‌నుండి విశ్రాంతి తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వ‌యోభారంలో తెలంగాణ నేత‌లు..! పోచారం కు ఇదే చివ‌రి ప‌ద‌వి..!

వ‌యోభారంలో తెలంగాణ నేత‌లు..! పోచారం కు ఇదే చివ‌రి ప‌ద‌వి..!

తెలంగాణలో స్పీకర్ పదవంటేనే వణికి పోయారు నేతలంతా. ఇక స్పీకర్ సీట్లో కుర్చున్నామంటే.. ఇక రాజకీయ భవిష్యత్ లేదన్నట్లే అని ఫిక్స్ అయ్యారంతా. దీనికి బలమైన కారణం కూడా ఉందండోయ్! ఇప్పటివరకు స్పీకర్ పదవి చేపట్టిన ఎవ్వరు కూడా ఆ తర్వాతి ఎన్నికల్లో తమతమ ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఈ సారి తెలంగాణలో స్పీకర్ సీట్లో కూర్చోబోయే వారెవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

స్పీక‌ర్ ప‌ద‌విని తిర‌స్క‌రించిన ఈటెల‌..! పోచారంను వ‌రించిన ప‌ద‌వి..!

స్పీక‌ర్ ప‌ద‌విని తిర‌స్క‌రించిన ఈటెల‌..! పోచారంను వ‌రించిన ప‌ద‌వి..!

ఈ ఉత్కంఠ నడుమ స్పీకర్ పదవి సీనియర్ నేత పోచారం శ్రేనివాస్ రెడ్డిని వరించింది. తెలంగాణ రెండో శాసనసభ కొలువుదీరటం, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయటం, ఏకగ్రీవంగా స్పీకర్‌గా పోచారం ఎన���నిక కావటం జరిగాయి.అయితే పోచారం స్పీకర్ పదవి పుచ్చుకోవటం వెనుక ఓ పెద్ద కథే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పదవిని మొదట మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తీసుకోమని గులాబీ బాస్ కేసీఆర్ ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన ససేమిరా వద్దని వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దూరం..! రాజ‌కీయ ప్ర‌యాణం చాలంటున్న పోచారం..!!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దూరం..! రాజ‌కీయ ప్ర‌యాణం చాలంటున్న పోచారం..!!

దీంతో కేసీఆర్ మర��� సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఇంటికి పిలిపించి ఈ పదవి అప్పగించాడని సమాచారం. పోచారం శ్రీనివాస్‌కి ఇప్పటికే వయసు బాగా మీదపడింది. దాదాపు 70 ఏళ్ల వయసున్న ఆయన రాజకీయాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. అందుకే ఇక తాను రిటైర్‌మెంట్ తీసుకొని ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు రంగంలోకి దించాలని చూశారు. కానీ అందుకు కేసీఆర్ ఒప్పుకోకపోవడంతో చివరకు ఆయనే బరిలోకి దిగ��ల్సి వచ్చింది.

పోచారం, నాయిని వంటి నేత‌ల‌కు విశ్రాంతి..! అదే బాట‌లో మ‌రికొంత మంది..!!

పోచారం, నాయిని వంటి నేత‌ల‌కు విశ్రాంతి..! అదే బాట‌లో మ‌రికొంత మంది..!!

కాగా వచ్చేసారి మాత్రం తాను పోటీచేయనని, కుమారుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ వద్ద పోచారం ప్రస్తావన తీసుకొచ్చారని తెలిసింది. దీనికి కేసీఆర్ ఓకే చెప్పేసి.. కుమారుడిని ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో నాయకుడిగా రాటుదేల్చాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాగూ ప��చారం వచ్చే ఎన్నికల్లో పోటీచేయరు కాబట్టి స్పీకర్ పదవికి ఆయనైతేనే కరెక్ట్ అని భావించిన చంద్ర‌శేఖ‌ర్ రావు చివరకు స్పీకర్‌గా పోచారంనే నిర్ణ‌యించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవ‌కాశం లేదు కాబ‌ట్టి, ఇక త‌న‌కు రాజకీయ జీవితం అవసరం లేదు కాబ‌ట్టి స్పీకర్ పదవికి పోచారం ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
This is the last opportunity for some of the leaders who are serving in government positions. There is a possibility of exiting some of the politicians by the general election that some of the leaders already have to relax, Pocharam Srinivas Reddy, who was elected as Speaker of the Telangana Legislative Assembly, is also expected to rest from politics after this term
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X