• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ మాస్టర్ స్ట్రోక్: సీఎం కేసీఆర్‌పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు -నడ్డా సమక్షంలో కమలతీర్థం

|

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఇస్తోన్న బీజేపీ.. తాజాగా తెలంగాణ ఉద్యమకారులపై ఫోకస్ పెంచింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరి, శాసన మండలి చైర్మన్ గానూ పని చేసిన స్వామిగౌడ్ బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. స్వామిగౌడ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

తిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకితిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకి

  TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!
   ఎన్నికల వేళ భారీ షాక్

  ఎన్నికల వేళ భారీ షాక్

  తెలంగాణ ఉద్యమం సమయంలో టీఎన్జీవోల అధ్యక్షుడిగా స్వామిగౌడ్.. కేసీఆర్ కు తలలో నాలుకగా వ్యవహరించారు. ఆయన సహకారానికి గుర్తింపుగా తెలంగాణ మండలికి మొట్టమొదటి చైర్మన్ గా గౌడ్ కు కేసీఆర్ అవకాశం కల్పించారు. తొలి టర్మ్ లో అంతా బాగున్నా, 2018 ఎన్నికల తర్వాత వీరి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సకల అస్త్రాలను ప్రయోగిస్తోన్న బీజేపీ.. ప్రచారంపై దృష్టి పెడుతూనే.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్‌ ఇవ్వగా తాజాగా స్వామిగౌడ్‌ను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా గట్టి షాకిచ్చింది.

  సొంత ఇంటికి వచ్చేశా..

  సొంత ఇంటికి వచ్చేశా..

  చిన్నవయసు నుంచే ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లే అలవాటున్న తాను ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా తిరిగి మాతృసంస్థకు వచ్చినట్లుందని స్వామి గౌడ్ చెప్పారు. ఏవో పదవులు ఆశించి తాను బీజేపీలో చేరలేదని, టీఆర్ఎస్ లో మారిన పరిస్థితులను చూసి తట్టుకోలేకపోయానని, ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వాళ్లకు కేసీఆర్ పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవారి పట్ల కేసీఆర్ అలక్షం వహించారని, ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోలేరా? ఉద్యమకారులను ఎండన నిలబెట్టి.. పోరాడని వారికి మాత్రం గొడుగు పడతారా? అని ప్రశ్నించారు. అంతేకాదు,

  ఆత్మగౌరవం కోసమే బీజేపీలోకి..

  ఆత్మగౌరవం కోసమే బీజేపీలోకి..

  ‘‘బీజేపీలోకి చేరాలన్న నా నిర్ణయాన్ని కేసీఆర్ కచ్చితంగా గౌరవిస్తారనే భావిస్తున్నాను. రెండేళ్ల నుంచి సీఎంను కలిసేందుకు ప్రయత్నించా. కనీసం 100 సార్లు అపాయింట్ మెంట్ అడిగి ఉంటాను. కానీ ఇంతవరకు ఆయన నాకు టైమివ్వలేదు. ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాను. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పార్టీ మార్పు. చాలా మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లభించడం లేదు. జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుంది. ఐదేళ్లలో ఉన్న పరిపాలన వేరు. ఇప్పుడున్న పాలన వేరు'' అని స్వామిగౌడ్ చెప్పుకొచ్చారు.

  బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?

  English summary
  Swami Goud, a senior TRS leader and former Chairman of the Telangana Legislative Council, joined the BJP on wednesday. Goud has joined the Saffron party in the presence of BJP national president JP Nadda in New Delhi. ahead of greater hyderabad municipal elections, this is a big jolt to trs. swami goud slams cm kcr.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X