హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ చట్టాలతో ముస్లింలకే ఎక్కువ నష్టం - ఆలయ భూముల్ని కాపాడండి - కొత్త రెవెన్యూ చట్టానికి ఎంఐఎం మద్దతు

|
Google Oneindia TeluguNews

కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ఏఐఎంఐఎం మద్దతు పలికింది. కొత్త రెవెన్యూ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపేందుకు ఈ చట్టాన్ని రూపొందించారంటూ సీఎం కేసీఆర్ ను అభినందిస్తూనే.. కీలక సవరణలు సూచించారు.

చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ 'స్పెషల్’ ఎంట్రీ చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ 'స్పెషల్’ ఎంట్రీ

గత చట్టాలతో ఏం సాధించాం?

గత చట్టాలతో ఏం సాధించాం?

ముందుగా నిర్ణయించిన ప్రకారం కొత్త రెవెన్యూ బిల్లుపై తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభించారు. సభ్యుల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, చివర్లో ప్రభుత్వ వివరణ ఇస్తామని తెలిపారు. అనంతరం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. భూముల‌కు సంబంధించి గతంలోనూ వివిధ చ‌ట్టాలు వచ్చినా, చాలా చోట్ల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, కనీసం కొత్త రెవెన్యూ చ‌ట్టం ద్వారానైనా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.

సెక్స్ లో సుఖానుభూతి దైవిక‌మైన‌ది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాసెక్స్ లో సుఖానుభూతి దైవిక‌మైన‌ది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా

ముస్లింలకే నష్టం..

ముస్లింలకే నష్టం..

‘‘గత చట్టాలతో ఎక్కువగా ముస్లింలే ఎక్కువగా నష్టపోయారు. స్వాతంత్ర్యం తరువాత భూములు పోగొట్టుకున్న వారిలో అధికులు ముస్లింలే. ప‌ట్టాల ఎంట్రీలో చాలా అక్ర‌మాలు జ‌రిగాయి. క్షేత్ర‌స్థాయిలో ఉన్న భూమి రికార్డుల్లో ఉన్న వివ‌రాల్లో తప్పులు తలెత్తాయి. అంతేకాదు, చట్టాలపేరుతో వక్ఫ్, దేవాదాయ శాఖ, దర్గా భూములకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఏళ్లుగా సర్వేలు చేస్తున్నారే తప్ప వాటిని కాపాడుకునే దిశగా చర్యలు లేవు. అలాగే హైదరాబాద్ పాతబస్తీలో, జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా మురికివాడలకు లే అవుట్లు లేవని సభ దృష్టికి తెస్తున్నా'' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

ఓవైసీ కీలక సూచనలు..

ఓవైసీ కీలక సూచనలు..

కొత్త రెవెన్యూ చట్టంలో ఇంకొన్ని కీలక అంశాలను చేర్చాల్సి ఉందని, వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత ‘ధరణి' పోర్టల్ లోకి భూములు రికార్డులను ఎంటర్ చేసే బాధ్యత ఎవరు నిర్వహిస్తారన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ధరణికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. అలాగే, గ్రీన్ జోన్లను కచ్చితంగా ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని అన్నారు. భూములకు రిజిస్ట్రేషన్లు లేక, పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా, చదివించుకోవాలన్నా భూ యజమానులకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని ఎంఐఎం నేత కోరారు.

English summary
AIMIM floor leader Akbaruddin Owaisi has demanded Telangana Government to take stringent action against those encroached upon the endowments and Wakf lands. Participating in the debate on new Revenue Bill in the Assembly, he expressed serious concern over increasing illegal occupation of lands owned by state endowment department, Temple trusts and wait board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X