హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న 'ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టించింది. మంగళవారం వెలువడిన బీహార్ ఫలితాల్లో ఎంఐఎం మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. బీహార్ ఫలితాలు హంగ్ దిశగా వెళుతుండటంతో ఓవైసీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి..

దుబ్బాక ఫలితంపై హరీశ్‌రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?దుబ్బాక ఫలితంపై హరీశ్‌రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?

ఎంఐఎం ఖాతాలోని సీట్లివే..

ఎంఐఎం ఖాతాలోని సీట్లివే..


బీహార్ లోని సీమాంఛల్ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. అక్కడి అరారియా, పూర్నియా, కృష్ణగంజ్, కతిహార్ తదితర జిల్లాల్లో విస్తరించిన 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములను డిసైడ్ చేసేది ముస్లింలే కావడంతో అక్కడ పాగా వేసేందుకు ఎంఐఎం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది. ఎట్టకేలకు గతేడాది ఉప ఎన్నికలో అమోర్ అసెంబ్లీ సీటును గెలుచుకుంది. మళ్లీ ఏడాది తర్వాత తాజా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అసద్ పార్టీ ఏకంగా 5 సీట్లలో విజయఢంకా మోగించింది. సిట్టింగ్ సీటు ఆమోర్ తోపాటు కొఛాధమన్, జోకిహత్, బైసి, బహదూర్ గంజ్ అసెంబ్లీ స్థానాలను పతంగి గుర్తు పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్‌మీట్దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్‌మీట్

కుశ్వాహ పొత్తుతో ఖుషీగా..

కుశ్వాహ పొత్తుతో ఖుషీగా..

24 అసెంబ్లీ స్థానాలున్న సీమాంఛల్ ప్రాంతంలో ఎంఐఎం పార్టీ ఈసారి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళిత-ముస్లిం కూటమిగా పేరుపొందిన ఈ గ్రూపులో మాయవతి బీఎస్పీ పార్టీకూడా చేరడం అదనపు బలాన్నిచ్చినట్లయింది. పొత్తులో భాంగా ఎంఐఎం మొత్తం 14 సీట్లలో అభ్యర్థుల్ని దింపగా, 5చోట్ల విజయం సాధించింది. తాజా ఫలితాలతో తెలంగాణ(హైదరాబాద్) తర్వాత ఎంఐఎంకు అత్యధిక మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రం బీహారే కావడం గమనార్హం. అదీగాక..

అసదుద్దీన్ నిర్ణయాత శక్తి?

అసదుద్దీన్ నిర్ణయాత శక్తి?

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్నికల సంఘం తాజా అప్ డేట్ ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల వరకు 123 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించడంతోపాటు వాటిలో 72 చోట్ల ఇప్పటికే విజయం సాధించింది. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మహా కూటమి 113 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుండటంతోపాటు 65 చోట్ల ఇప్పటికే గెలుపొందింది. ఐదు సీట్లతో ఎంఐఎం ఇప్పుడు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల్లో అతి పెద్దదిగా అవతరించింది. ఇండిపెండెంట్ కు ఒకటి, బీఎస్పీకి ఒక సీటు దక్కాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోన్న చోట్ల ఆధిక్యత 200 నుంచి 1000ఓట్ల లోపే ఉండటంతో ఫలితాల్లో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించే అవకాశముంది. దీనిపై..

Recommended Video

#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC
బీజేపీ బీటీమ్ గా ఎంఐఎం..

బీజేపీ బీటీమ్ గా ఎంఐఎం..

హైదరాబాద్ వెలుపల మజ్లిస్ ఎక్కడ పోటీ చేసినా, అది ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. తాజా బీహార్ ఎన్నికల్లోనూ ఎంఐఎంను ‘ఓట్ కట్టర్'గా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. అయితే, తాము ఓట్లు చీల్చేవాళ్లం కాదని, బీజేపీని గట్టిగా దెబ్బకొట్టగలమని బీహార్ ఫలితాలతో రుజువైందని ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి అసీం వకార్ అన్నారు. బీహార్ ఫలితాల్లో హంగ్ ఏర్పడితేగనుక తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వబోమని ఎంఐఎం స్పష్టం చేసింది. మరి తేజస్వీ నేతృత్వంలోని మహా కూటమికైనా మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయిస్తారని వకార్ తెలిపారు.

English summary
The Asaduddin Owaisi-led All India Majlis-e-Ittehad-ul-Muslimeen has won five assembly seats in Bihar. all those 5 Seats in Seemanchal Region. Those who called us vote-cutters have been answered and won’t back BJP, says AIMIM national spokesperson Asim Waqar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X