హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరి చూపు నిజామాబాద్ వైపు.. 5 గంటలకల్లా 54.20 శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ సమరభేరికి తెరపడింది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 16 చోట్ల సాయంత్రం 5 గంటల లోపే పోలింగ్ ముగిసినా.. నిజామాబాద్ లో మాత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎన్నికల బరిలో నిలవడంతో ఈ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టి ఆకర్షించింది. మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీపడటంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలు పెట్టాల్సిన పరిస్థితి. ఆ మేరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. దాంతో ఓటింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల 5 గంటలకు క్లోజ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 60.57 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ లో 68.60 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ సెగ్మెంట్ లో పోలింగ్ శాతం ఇంకా పెరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓట్ల ప్రకారం అక్కడ 54.20 శాతంగా ఉంది.

All eyes on Nizamabad segment

<strong>వైరల్ : కశ్మీర్ లో ఓటర్ సంతోషం.. పోలింగ్ కేంద్రం దగ్గర డ్యాన్స్ (వీడియో) </strong>వైరల్ : కశ్మీర్ లో ఓటర్ సంతోషం.. పోలింగ్ కేంద్రం దగ్గర డ్యాన్స్ (వీడియో)

పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..
మెదక్ 68.60, భువనగిరి 68.25, కరీంనగర్ 68.00, ఖమ్మం 67.96, జహీరాబాద్ 67.80, ఆదిలాబాద్ 66.76, నల్గొండ 66.11, మహబూబ్ నగర్ 64.99, వరంగల్ 60.00,
మహబూబాబాద్ 59.90, పెద్దపల్లి 59.24, నాగర్ కర్నూల్ 57.12, నిజామాబాద్ 54.20, చేవెళ్ల 53.80, మల్కాజిగిరి 42.75, హైదరాబాద్ 39.49, సికింద్రాబాద్ 39.20

English summary
Telangana lok sabha elections ended. Nation wide concentration on Nizamabad segment due to 185 contestants from here. Total percent whole state as 60.57 percent upto 5 pm and nizamabad vote percent as 54.20, total percent will increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X