హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పటిదాకా 10 లక్షలు, ఇప్పుడేమో లక్ష.. 9999 క్రేజ్ తగ్గిందా.. లేదంటే గోల్‌మాలా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అన్నీ తొమ్మిదులే.. ఆల్ నైన్స్ నెంబర్ డిమాండే వేరు. ఆ నెంబర్ కారు రోడ్లపై రయ్‌మని దూసుకెళుతుంటే కళ్లన్నీ అటువైపే మళ్లుతాయి. సెలబ్రిటీలో లేదంటే బిగ్‌షాట్‌లో లక్షలు పోసి ఆ నెంబర్లను సొంతం చేసుకుంటారు. హాట్ కేక్ లాంటి ఆల్ నైన్ నెంబర్ కోసం రవాణాశాఖ నిర్ణయించిన మొత్తం కేవలం 50 వేల రూపాయలే. కానీ వేలం పాటలో మాత్రం అది లక్షలు పలుకుతోంది.

గత ఐదేళ్ల కాలంలో చూసినట్లయితే ఒకటి రెండు సార్లు మినహా ప్రతి సిరీస్‌లో కూడా 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ధర పలికింది. ఒక్కోసారైతే పదుల సంఖ్యలో పోటీ పడి ఆల్ నైన్ నెంబర్ దక్కించుకునేందుకు ఎగబడుతుంటారు. అలాంటిది గురువారం నిర్వహించిన యాక్షన్‌లో అతి తక్కువ ధర పలకడం విస్మయానికి గురిచేస్తోంది.

 ఆల్ నైన్స్ యమ క్రేజీ.. బట్ ఈసారి..!

ఆల్ నైన్స్ యమ క్రేజీ.. బట్ ఈసారి..!


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఆల్‌ నైన్స్‌ (9999) నెంబర్ కోసం పోటీ అంతా ఇంతా కాదు. సినిమా సెలబ్రిటీలు మొదలు లీడర్లు, బడా వ్యాపారవేత్తలు భారీ స్థాయిలో పోటీపడతారు. కొత్త సిరీస్ వచ్చిందంటే చాలు.. తమ ఖరీదైన లగ్జరీ కార్లకు ఆల్ నైన్ నెంబర్ ఉండేలా ఆరాటపడతారు. ఆ క్రమంలో రవాణాశాఖ నిర్వహించే వేలం పాటలో పాల్గొని లక్షలు ధారపోసి ఆ నెంబర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఆల్ నైన్ నెంబర్ క్రేజీగా మారడంతో 10 లక్షల రూపాయలకైనా రెడీగా ఉంటారు చాలామంది. అయితే గురువారం నాడు జరిగిన వేలం పాటలో కేవలం ఒక లక్ష 7 వేల రూపాయలకే ఆ నెంబర్‌ను ఓ లాజిస్టిక్ కంపెనీ సొంతం చేసుకోవడం చర్చానీయాంశమైంది. దాదాపు 85 లక్షల రూపాయల విలువ చేసే తమ బెంజ్ కారు కోసం అతి తక్కువ ధరకే TS 09 FF 9999 నెంబర్ దక్కించుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఎంత పని చేసింది బీజేపీ అధిష్టానం.. మా నోరు మూయించిందని బాధపడుతున్న రాష్ట్ర నేతలుఎంత పని చేసింది బీజేపీ అధిష్టానం.. మా నోరు మూయించిందని బాధపడుతున్న రాష్ట్ర నేతలు

కేవలం లక్ష 7వేలకే 9999 నెంబరా?

కేవలం లక్ష 7వేలకే 9999 నెంబరా?

ఖైరతాబాద్‌ ఆర్టీఏ చరిత్రలో ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు ఇంత తక్కువ రేటు రావడం ఇదే తొలిసారి కావొచ్చు. గడిచిన ఐదేళ్ళలో దాదాపు 35 సార్లు ఆల్ నైన్స్ నెంబర్ కోసం వేలం పాట జరిగింది. దాదాపు అన్నీ సందర్భాల్లోనూ 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు ధర పలికింది. అలాంటిది ఈసారి కేవలం ఒక లక్ష 7 వేల రూపాయలకే ఈ నెంబర్ పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాహనదారులంతా కలిసి సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కోట్ చేశారా అనేది ఓ కోణం. లేదంటే ఆర్టీఏ అధికారులు సదరు కంపెనీకి లాభం చేకూర్చేలా చక్రం తిప్పారా అనేది మరో కోణం. అదలావుంటే ఏజెంట్ల తీరుపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్సీ నెంబర్ల క్రేజీ ద‌ృష్ట్యా కొందరు ఏజెంట్లు తక్కువ మొత్తానికే వాటిని ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

 ఆర్టీఏ ఆదాయానికి గండి.. ఈసారి కేవలం 11 లక్షల 14వేలే..!

ఆర్టీఏ ఆదాయానికి గండి.. ఈసారి కేవలం 11 లక్షల 14వేలే..!

ఫ్యాన్సీ నెంబర్ల క్రేజీ ఆర్టీఏకు భారీ ఆదాయం సమకూర్చుతోంది. అన్ని రకాల సిరీస్‌ల్లో ప్రత్యేక నెంబర్లపై నిర్వహించే వేలం పాటలతో ప్రతి సంవత్సరం 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు అంచనా. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త సీరిస్‌ ప్రారంభం కావడం ఆనవాయితీ. అయితే ఈ నెలలో TS 09 FF సీరిస్ తో పాటు TS 09 FG సీరిస్ లో కేవలం 11 లక్షల 14 వేల రూపాయల ఆదాయం రావడం గమనార్హం.

సుచిరిండియా సంస్థ TS 09 FG 0001 నెంబరును 4 లక్షల రూపాయలకు సొంతం చేసుకోగా.. TS 09 FG 0007 నెంబర్ కేవలం 86 వేల 750 రూపాయలు మాత్రమే పలికింది. ఇదివరకు ఇలాంటి నెంబర్లకు బాగా డిమాండ్ ఉండేది. కనీసం 25 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఈసారి ఆర్టీఏ నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాట పలు అనుమానాలకు తావిస్తోంది. క్రేజీ నెంబర్లు సైతం అతి తక్కువ ధర పలకడం విస్మయానికి గురిచేస్తోంది.

English summary
Fancy Number All Nines rate dropped to one lakh rupees from ten lakhs. Earlier big shots and celebrities own this number with lakhs of rupees. But, this time 9999 fancy number sale for only one lakh rupees. Many doubts raised in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X