• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్‌పై విరుచుకుపడ్డ అఖిలపక్షం.. బ్రేక్ వేయాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు

|

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అపొజిషన్ లీడర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ మేరకు కొందరు నేతలు కలిసి గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

సర్వాంతర్యామిగా ఫీలవుతూ సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత డీకే అరుణ మరో అడుగు ముందుకేసి కేసీఆర్‌కు మెంటల్ ఎక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ మానసిక స్థితి సరిగా లేదని.. ఆయన తీసుకునే నిర్ణయాలను సమర్థించొద్దని గవర్నర్‌కు సూచించారు.

కేసీఆర్‌పై భగ్గుమన్న అఖిలపక్షం నేతలు

కేసీఆర్‌పై భగ్గుమన్న అఖిలపక్షం నేతలు

రాష్ట్రంలో నియంత పోకడలను ఆచరిస్తూ సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు అఖిలపక్షం నేతలు. సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలను కొత్తగా నిర్మించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి పాత భవనాలను కూల్చివేయకుండా నిలువరించాలని గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో "ప్రజాస్వామిక తెలంగాణ వేదిక" సారథ్యంలో జి.వివేక్ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన నేతలు గవర్నర్‌ను కలిశారు. ఈ నెల 7వ తేదీన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలను గవర్నర్‌కు అందించారు.

మోడీ తీరు మారిందా.. బీజేపీ నేతలకు ఇక దబిడి దిబిడేనా?మోడీ తీరు మారిందా.. బీజేపీ నేతలకు ఇక దబిడి దిబిడేనా?

 కేసీఆర్‌కు మెంటల్.. డీకే అరుణ ఫైర్

కేసీఆర్‌కు మెంటల్.. డీకే అరుణ ఫైర్

బీజేపీ లీడర్ డీకే అరుణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు మెంటల్ ఎక్కిందని.. మానసిక రోగంతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలను గవర్నర్ సమర్థించొద్దని కోరారు. రాష్ట్రానికి తానే సర్వంతర్యామిలా ఫీలవుతూ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌గా వ్యవహరిస్తున్నారని.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి.

 ఈనాటి తుగ్లక్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారుగా..!

ఈనాటి తుగ్లక్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారుగా..!

రాజధానిని ఇష్టమొచ్చిన తీరుగా మార్చిన తుగ్లక్‌ను ఆనాడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు వివేక్. ఈనాడు భవనాలు కూలగొడతా.. కొత్తవి కడతా అంటూ అదే తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్న కేసీఆర్‌ను జనం ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గవర్నర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8, 80 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీ తరపున కస్టోడియన్ ఐన గవర్నర్ అన్ని భవనాల భద్రతను పర్యవేక్షించాలని కోరినట్లు చెప్పారు.

 భవనాల తరలింపులో కుట్ర.. రేవంత్ రెడ్డి గుస్సా

భవనాల తరలింపులో కుట్ర.. రేవంత్ రెడ్డి గుస్సా

భవనాల తరలింపులో సీఎం కుట్ర దాగి ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ బినామీలు వేల ఎకరాలను ఆక్రమించుకున్నారు. వాటి గుట్టురట్టు కాకుండా ఉండేందుకే ఈ తతంగమని మండిపడ్డారు. భవనాల తరలింపులో వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు మిస్సయ్యాయని చెప్పడానికే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఆ ఫైళ్ల భద్రతను చూసే బాధ్యత గవర్నర్‌దేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కుట్రలపై వచ్చేవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడ కేసు విచారణకు వచ్చే సమయంలో గవర్నర్ కూడా హాజరుకావాల్సి ఉంటుందన్నారు.

బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!

 రాష్ట్రాన్ని గవర్నరే కాపాడాలి : కోదండరాం

రాష్ట్రాన్ని గవర్నరే కాపాడాలి : కోదండరాం

గవర్నర్ సీఈఓ లాంటివారనీ.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు కోదండరామ్. ట్రాఫిక్ సహా ఎలాంటి ఇబ్బందులు కలిగించని సెక్రటేరియట్ భవనాలను కూల్చడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతమున్న సచివాలయానికి మరో 70 ఏళ్ల వరకు ఢోకా లేకున్నా.. కొత్తవి కట్టాలనుకోవడం మూర్ఖత్వమేనని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని.. కేసీఆర్ నిర్ణయాలకు బ్రేక్ వేయాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

English summary
All party leaders met with governor and complaints on cm kcr. They commented on kcr like he was an mad, thats why he gives priority to unneccesary things. They asked why he built new assembly, secretariat bulidings. The Governor should take further action to stop the construct new buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X