హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్పి‘పోల్స్’కు రెడీ.. ఉదయం 7 నుంచి ఓటింగ్.. తొలిసారి ఫేస్ రికగ్నిషన్ యాప్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. బుధవారం(జనవరి 22) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 9 కార్పొరేషన్లకు కలిపి 1438 పోలింగ్ కేంద్రాలను, 120 మునిసిపాలిటీలకు సంబంధించి 6325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన ఓటర్ల సంఖ్య 53.37 లక్షలని చెప్పారు.

విధుల్లో 45 వేల మంది..
బుధవారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల విధుల కోసం మొత్తం 45వేల మందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలకు ఇప్పటికే చేరుున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఒక్క దబీర్ పురా డివిజన్‌లోనే బై ఎలక్షన్ జరుగుతుండగా, కరీంనగర్ కార్పొరేషన్ కు ఈ నెల 24న పోలింగ్ జరుగనుంది.

All set for Telangana municipal elections, voting will begin at 7am

తొలిసారి ఫేస్ రికగ్నిషన్ యాప్..
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా నకిలీ ఓట్లను గుర్తించడానికి దేశంంలో తొలిసారి 'ఫేస్ రికగ్నిషన్ యాప్'ను ఎన్నికల అధికారులు ప్రవేశపెడుతున్నారు. మల్కాజ్ గిరి జిల్లా కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ నంబర్ బూత్ లో ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

English summary
Officials have compleated all the preparations for the municipal elections in Telangana on Wednesday (January 22). Polling will be held in 9 municipal corporations and 120 municipalities across the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X