హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇందిరా పార్క్ వద అంబేడ్కర్‌ వాదుల మహాగర్జన..! కదం తొక్క నున్న ఎంఆర్పీఎస్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో మందకృష్ణ మాదిగ తన కార్యకలాపాలను ఉద్రుతం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్నాళ్లు నిశ్శబ్దంగా మారిపోయిన ఎంఆర్పీయస్ కార్యక్రమాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. గత నెలలోనే పంజాగుట్ట చౌరస్తాలో దాదా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసింనందుకు నిరధనగా భారీ బహిరంగ సభకు ఉపక్రమించారు మందకృష్ణ. కాని పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తాజాగా ఆంక్షల మద్య ఇందిరా పార్క్ వద్ద నేడు అదే కార్యక్రమం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద 'అంబేడ్కర్‌వాదుల మహాగర్జన సభ' జరగనుంది.

పంజాగుట్టలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించినందుకు, అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రశేఖర్ రావు పాల్గొనక పోవటాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్‌ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, వివిధ పార్టీల నేతలను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. సభాస్థలాన్ని మందకృష్ణ మంగళవారం సందర్శించారు.

Ambedkar fans public meeting today.!mrps cadre to participate..!!

టీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల అగ్రనేతలు పాల్గొనే ఈ సభకు వేలాది మంది హాజరవుతారని, భారీ ఎత్తున నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులను కోరారు. సభను ఒక మూలకు నిర్వహించాలని పోలీసులు అంటున్నారని, అలా అయితే వేలాదిగా వచ్చే అంబేడ్కర్‌ వాదులకు ఇబ్బంది కలుగుతుందని మందకృష్ణ విజ్నప్తి చేసారు.

English summary
Mrps president Manda krishna asked all the people, intellectuals and leaders of various parties to participate at Dharna chowk at 2 pm, protesting the absence of CM KCR in the Ambedkar Jayanthi program for insulting the Ambedkar statue destruction in Panjaguta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X