హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓట‌ర్ల జాబితాలో స‌వ‌ర‌ణ‌లు..! ఏ ఫార‌మ్ ఎందుకో తెలుసుకోండి...!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : మీకు 18 ఏళ్లు నిండి మీరు ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌నుకుంటున్నారా..? ఓట‌ర్ల జాబితాలో మీ పేరు క‌నిపించ‌డం లేదా..? న‌మోదు చేసుకునే క్ర‌మంలో లోపాలేమైనా జ‌రిగాయా..? చిన్న చిన్న త‌ప్పిదాల వ‌ల్ల మీరు ఓట‌ర్ల జాబితా నుంచి త‌ప్పించ బ‌డ్డారా..? మ‌ళ్లీ మీరు ఓట‌ర్ల జాబితాలో న‌మోదు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారా..? ఐతే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా రూపొందించిన ఈ అప్లికేష‌న్ ఫారాల‌ను క్షుణ్నంగా చ‌దివి నింపితే మ‌ళ్లి మీ పేరు ఓట‌ర్ల జాబితాలోకి న‌మోదు కాబ‌డుతుంది. మ‌రి ఏ ఫారం ఎందుకో ఎలా నింపాలో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ఆన్‌లైన్‌లో కూడా ఈ విధంగా అప్లికేష‌న్ ఫారాన్ని నింపొచ్చు :- ఓటు ఉందా? లేదా సరిచూసుకోవడానికి, ఓటు నమోదు చేసుకునేందుకు www.ceotelangana. nic.in లేదా www.nvsp.in వెబ్‌సైట్లను పరిశీలించవచ్చు. ఆ రెండు వెబ్‌సైట్లలోకి వెళ్లి సెర్చ్ యువర్ నేమ్ అనే చోట క్లిక్ చేసి మీ నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపుకార్డు నంబరు నమోదు చేసిన వెంటనే మీకు ఓటు ఉందా? లేదా? ఉంటే ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో చెబుతుంది. ఆ రెండు వెబ్‌సైట్ల నుంచి ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ-రిజిస్ట్రేషన్ లేదా ఎన్వీఎస్పీ వెబ్‌సైట్‌లోకి వెళ్లినా నూతన ఓటరు నమోదు ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఓటరు నమోదు పత్రం వస్తుంది. అందులో కావాల్సిన భాషను ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేయడంతోపాటు ఫొటో, చిరునామా నిర్ధారిత పత్రాలను నిక్షిప్తం చేస్తే రశీదు వస్తుంది. అంతే కాకుండా సంబందిత త‌హ‌సిల్దారు కార్యాల‌యాల్లో కూడా ఓట‌రు న‌మోదు ప్ర‌క్రియ కు సంబందించి స‌మ‌గ్ర స‌మాచారంతో పాటు అప్లికేష‌న్ల‌ను కూడా ప్ర‌త్య‌క్షంగా పొందే అవ‌కాశం ఉంది. కింద అప్లికేష‌న్ ఫామ్ ల వివ‌రాలు తెలుసుకుందాం..!

Amendments to the Electoral List ..! Learn what form for why... !!

ఫారం-6 :
2019 జనవరి 1 నాటికి 18 యేళ్లు నిండిన వారెవరైనా ఓటుహక్కు నమోదు చేసుకోవాలంటే ఫారం-6ను భర్తీ చేయాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి ఓటు మార్చుకోవాలనుకున్న వారికీ ఇదే దరఖాస్తు.

ఫారం-ఏ :
విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులు ఓటుహక్కును నమోదు చేసుకోవాలంటే ఈ దరఖాస్తును పూర్తిచేయాలి. ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా పోస్టు ద్వారా ఈ ఫారాన్ని నింపి పంపవచ్చు.

ఫారం-7
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించుకునేందుకు ఈ దరఖాస్తును పూర్తి చేయాలి.

ఫారం-8 :
ఓటుహక్కు ఉండి, సవరణలు చేసుకునేందుకు ఈ దరఖాస్తు వెసులుబాటు కల్పిస్తుంది. ఓటరు గుర్తింపుకార్డులో పేరు, వయస్సు, బంధుత్వం ఫొటోల్లో తప్పులు ఉంటే ఈ దరఖాస్తుతో సరిదిద్దుకోవచ్చు.

ఫారం-8ఏ :
ఓటు ఉన్న నియోజకవర్గ పరిధిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇల్లు మారినప్పుడు చిరునామా మార్పు కోసం ఈ దరఖాస్తును వినియోగించుకోవాలి.

English summary
Are you 18 years old and you want to use the right to vote? Does your name appear in voters list or ..? Have any lapses in the registry order? Have you missed out of the voters list due to minor errors? Are you ready to register again in the voters list? But if the application forms by the Central and State Governments is thoroughly read and fill in your name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X