హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్ర‌మ వ‌ల‌స‌లు అడ్డుకునేందుకు అమెరికా ఉచ్చు..! చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌/హైద‌రాబాద్ : అక్రమ వలసదారులను పట్టుకునేందుకు ఫేక్‌ వర్సిటీని సృష్టించిన అధికారుల వైఖ‌రి విద్యార్థు భ‌విష్య‌త్తు కు శ‌రాఘాతంగా మారింది. అమెరికాలో నిభంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉంటున్నార‌ని అభియోగాలు మోపుతూ 200 మంది తెలుగువారిని గుర్తించి అక్ర‌మంగా నిర్బందించింది అమెరికా ప్ర‌భుత్వం. అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అరిక‌ట్టేందుకు అమెరికా అత్యంత చౌక‌బారు విధానాల‌ను అవ‌లంభింస్తోంద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. అమెరికా వైఖ‌రి ప‌ట్ల, ట్రంప్ విధానాల ప‌ట్ల ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుండి పెద్ద యెత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, వ‌ల‌స విద్యార్థుల ప‌ట్ల తాజాగా అమెరికా తీసుకున్న నిర్న‌యం మ‌రింత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. లేని యూనివ‌ర్సిటీని స్రుష్టించి వంద‌లాది విద్యార్థుల భ‌విష్య‌త్తుతో అమెరికా చెల‌గాటం అడుతోంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Americas trap to prevent illegal immigration..! Trapped Telugu students..!!

అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్‌ రాష్ట్రంలో ఒక ఫేక్‌ యూనివర్సిటీని సృష్టించి, సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌) అదుపులోకి తీసుకుంది. దీంతో భ‌విష్య‌త్తు మీద కోటి ఆశ‌ల‌తో అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థుల్లో కారు చీక‌ట్ల అలుముకున్నాయి. తెలుగు విద్యార్థులే కాకుండా ఇత‌ర దేశాల‌నుండి వ‌చ్చిన విద్యార్థుల్లో కూడా అంధ‌కారం అలుముకుంది. ఇప్పుడు అక్ర‌మంగా నిర్బందించిన వంద‌లాది మంది విద్యార్ధుల భ‌విత ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. కాగా ఇదే వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

English summary
The attitude of the officials who created the Fake University to catch illegal immigrants has become a hiatus for the student's future. The US government has detained over 200 detainees and illegally detained on charges of abuses in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X