హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"తెలంగాణ" వైపు "అమెరికా" యూనివర్శిటీల చూపు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అలా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండస్ట్రియల్ పాలసీని సులభతరం చేయడంతో పరిశ్రమలు తరలివస్తున్నాయి. అంతేకాదు వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఈ క్రమంలో అమెరికాకు చెందిన యూనివర్శిటీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇక్కడ వర్శిటీలు నెలకొల్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం పంచుకోవడం లేదంటే ప్రభుత్వం అనుమతిస్తే సొంతంగానే తమ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

 తెలంగాణకు అమెరికా యూనివర్శిటీలు..!

తెలంగాణకు అమెరికా యూనివర్శిటీలు..!

దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. అలా ప్రపంచం చూపు తనవైపు తిప్పుకుంది తెలంగాణ. సింగిల్ విండో ద్వారా త్వరితగతిన పరిశ్రమలకు అనుమతిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన వివిధ యూనివర్శిటీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కుదిరితే ఇక్కడి యూనివర్శిటీలతో భాగస్వామ్యంతో పనిచేయడం.. బోధన సిబ్బందికి అవసరమైన నైపుణ్యం పెంపొందించడం తదితర విషయాలపై దృష్టిసారించనున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఓకే చెబితే ఏకంగా తమ కేంద్రాలను ఇక్కడ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణే చెప్పారు ఇక ఆయనిష్టం, శివాజీ ఆధారాలిస్తే: నో చెప్పినా మళ్లీ చంద్రబాబు పవన్ కళ్యాణే చెప్పారు ఇక ఆయనిష్టం, శివాజీ ఆధారాలిస్తే: నో చెప్పినా మళ్లీ చంద్రబాబు

 అగ్రభాగాన ఐటీ.. అగ్రరాజ్యం వర్శిటీల చూపు

అగ్రభాగాన ఐటీ.. అగ్రరాజ్యం వర్శిటీల చూపు


తెలంగాణ ముఖచిత్రంపై ఐటీ రంగం అగ్రభాగంలో నిలుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం కూడా ఐటీ రంగ సంస్థలను ప్రోత్సహిస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగే ఛాన్సుందనేది అమెరికా వర్శిటీ యాజమాన్యాల అంతరంగం. అందుకే తెలంగాణ వైపు దృష్టి పెట్టాయి. ఈమేరకు ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్మన్ బాడిగ శ్రీకాంత్ మీడియాకు వివరాలు తెలిపారు.

అమెరికా వర్శిటీలొచ్చే నేపథ్యంలో తొలుత తెలంగాణ ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించనుంది. అక్కడ వివిధ యూనివర్శిటీలు సందర్శించి అధ్యయనం చేయనున్నారు. దాని తర్వాత అమెరికాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చిలో ఈ ప్రక్రియ వేగవంతం కానున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యామండలితో కూడా అవగాహన ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం..!

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం..!


తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారంతో తమ కార్యాచరణ సులభతరం అయిందన్నారు శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విదేశీ వర్శిటీల్లో చేరాక.. ఎక్కువ టాలెంట్ చూపిస్తున్నారని తెలిపారు. మనోళ్లు అమెరికాలో ఎక్కువ విజయాలు సాధించడానికి కారణం అక్కడున్న మౌలిక వసతులేనని స్పష్టం చేశారు. తెలంగాణలోని హైయ్యర్ ఎడ్యుకేషన్ లోని గ్యాప్ తగ్గిస్తే అత్యద్భుతమైన రిజల్స్ట్ సాధించొచ్చని తెలిపారు. అమెరికా వర్శిటీలు తెలంగాణకు వస్తే ఇక్కడి విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

English summary
America Universities are looking towards Telangana. Intrest to setup the universities here. Either collabration with telangana universities or else planning for set up their own centers if government gives permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X