• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సుమేధా మృతితో కదిలిన సర్కార్ - అంతటా ఓపెన్ నాలాల మూసివేత‌ - కేటీఆర్ కీలక ఆదేశాలు

|

కొద్ది రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటం, రాబోయే రెండు వారాలు కూడా విస్తారంగా వానలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వెలువడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల హైదరాబాద్ లోని దీనదయాళ్ నగర్ లో సుమేధ అనే 12 ఏళ్ల చిన్నారి నాలాలో కొట్టుకుపోయి మరణించిన ఘటనతో సర్కారులో కదలిక వచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా ఓపెన్ నాలాల పైకప్పులను మూసేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. భారీ వర్షాలపై మున్సిపల్ శాఖ అధికారులతో సోమవారం జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు.

నేరెడ్‌మెట్‌లో మిస్సింగ్ బాలిక మృతదేహం లభ్యం: సైకిల్‌తో సహా డ్రైనేజీలో కొట్టుకుపోయి

రూ. 300 కోట్ల‌తో స్పెషల్ డ్రైవ్..

రూ. 300 కోట్ల‌తో స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్ న‌గ‌రంతోపాటు రాష్ట్రమంతటా ఓపెన్ నాలాల పైక‌ప్పులు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఓపెన్ నాలాల‌పై క్యాపింగ్‌(బాక్స్ డ్రైనేజీల‌) నిర్మాణానికి రూ. 300 కోట్ల‌తో స్పెషల్ డ్రైవ్ చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. పనులు వేగంగా ప్రారంభమయ్యేలా సిటీలోని అన్ని నాలాల స‌మాచారం సేక‌రించాల‌ని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై మున్సిపల్, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

సిగ్గుపడాలి..చేయని సాయం చేసినట్లు - బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ - లెక్కలతో బండి సంజయ్ కౌంటర్

ఇకపై ఓపెన్ నాలా కనిపించొద్దు..

ఇకపై ఓపెన్ నాలా కనిపించొద్దు..

రెండు మీటర్లకన్నా త‌క్కువ వెడ‌ల్పు ఉన్న నాలాల‌పై క్యాపింగ్ నిర్మాణం చేస్తామని, అదే, రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ వెడ‌ల్పున్న నాలాల‌కు సంబంధించి సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుసరించి చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాధ్య‌మైనంత తొందరగా పనులు పూర్తిచేసేలా యంత్రాంగం ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని, ఒకవేళ నాలాలకు క్యాపింగ్ కుద‌రకపోతే ప‌క‌డ్బందీగా ఫెన్సింగ్ చేయాలని, రాబోయే రోజుల్లో ఓపెన్ నాలాలు కనిపించడానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. అదేసమయంలో సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పాత భవనాలను పరిశీలించాలని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నవాటిని వెంటనే కూల్చేయాలని సూచించారు.

హ్యాట్సాఫ్ వరుణ్..పీకల్లోతు నీళ్లలో 10ఏళ్ల బాలుడి నిరసన -అందరినీ కదిలించాడు -రైతులంటే సినిమా షో కాదు

  Telangana Floods : KTR Announces Rs 25 Crore For Warangal!
  మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు

  మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు

  భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాబోయే రెండు వారాల పాటు మున్సిపల్ శాఖలో సిబ్బందికి సెల‌వులు ర‌ద్దు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. విపత్తుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని, నిరంత‌రం క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, వర్షాలు తగ్గగానే పారిశుద్ధ్య పనులపై ఫోకస్ పెంచాలని చెపపారు. గ‌త 10 రోజుల్లోనే 54 సెం.మీ. భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని అధికారులు మంత్రికి వివరించారు.

  English summary
  MAand UD Minister KTR reviewed the impact of the heavy rains in Hyderabad city and other Urban Local Bodiess in the State. Minister instructed the officials to take all necessary precautions and also step up relief measures where required. The MAUD officials informed Minister KTR that Hyderabad has received a heavy rainfall of 54 cm in the last ten days. They also mentioned that the heavy rains lashed the city within few hours leading to water logging in low lying areas.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X