• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్‌పై అర్వింద్ సంచలనం

|

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించగా, బీజేపీయేతర 18 పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. తెలంగాణలో అధికారికంగా బంద్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులను ఉద్దేశించి సంచలన, వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఎంపీ మీడియాతో మాట్లాడారు. అర్వింద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

టిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూటిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూ

సీఎం కాదు చీఫ్ బ్రోకర్..

సీఎం కాదు చీఫ్ బ్రోకర్..

‘‘కేసీఆర్ సీఎంగా కంటే దళారీలకు చీఫ్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు. అనుచిత విధానాలతో రైతుల రక్తం తాగే బ్రోకర్ లా మారిపోయారు. తెలంగాణలో మక్కలు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? సన్నాలను వేయమని రైతులకు చెప్పి, వాటిని ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదు? తెలంగాణలో పండుతోన్న పసుపును కాదని కమిషన్ కోసమే కేసీఆర్ సర్కారు పసుపును దిగుమతి చేసుకుంటుడటం వాస్తవం కాదా? ఎక్కడ తమకొచ్చే వేల కోట్ల కమిషన్లు పోతున్నాయనే భయంతోనే వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల ఏడుస్తున్నాయి. ఈ విషయంలో..

భారత్ బంద్ హైజాక్ -రైతు పిలుపుపై పార్టీల రాజకీయం -కొన్ని రాష్ట్రాల్లోనే ఎఫెక్ట్ -రాజధానుల్లో నార్మల్భారత్ బంద్ హైజాక్ -రైతు పిలుపుపై పార్టీల రాజకీయం -కొన్ని రాష్ట్రాల్లోనే ఎఫెక్ట్ -రాజధానుల్లో నార్మల్

ధర్నా చౌక్ ఎత్తేసి డ్రామాలా?

ధర్నా చౌక్ ఎత్తేసి డ్రామాలా?

వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ గానీ, ఆయన కుటుంబీకులుగానీ ఎవరు చర్చకు వచ్చినా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. అసలు నిరసనలు, ధర్నాలు చేసే నైతిక హక్కు టీఆర్ఎస్ కు ఉందా? హైదరాబాద్ సహా రాష్ట్రంలో ధర్నా చౌక్ లను ఎత్తేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది కాదా? పేద రైతులకు మేలు చేసే విధంగా మోదీ సర్కార్ వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తే, దళారీలంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలో రోడ్లపై ఉన్నవారంతా దళారులే తప్ప రైతులు కారు. అలాంటోళ్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు.. స్వయంగా కార్పొరేట్ వ్యవసాయం చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతివ్వడం సాధారణ రైతుల్ని మోసం చేయడం కాదా? ఇదే తీరు కొనసాగితే..

తెలంగాణలో రాష్ట్రపతి పాలన..

తెలంగాణలో రాష్ట్రపతి పాలన..


రైతుల విషయంలో టీఆర్ఎస్ చేస్తోన్న ఫేక్ ఉద్యమం నడుపుతోంది. అసలు ఉద్యమం ఎలా ఉంటుందో కేసీఆర్ కు మేమే చూపెడతాం. నెత్తురు తాగే బ్రోకల్ లా వ్యవహరిస్తోన్న కేసీఆర్ పై తెలంగాణ రైతులు తిరగబడతారు. బట్టలూడదీసి మరీ కొడతారు. అతి త్వరలోనే గడాఫీకి పట్టిన గతే కేసీఆర్ కు పట్టబోతోంది. కేసీఆర్ పాలన తీరును మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అవతల వెస్ట్ బెంగాల్ నే మేం కొట్టబోతున్నాం.. ఈ కేసీఆర్ మాకు పెద్ద సమస్యకాదు.

గ్రేటర్ డోసు సరిపోలేదా?

గ్రేటర్ డోసు సరిపోలేదా?

కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల డోసు ఇంకా సరిపోలేదా? నిజం చెప్పాలంటే ఇవాళ బీజేపీకి టీఆర్ఎస్ నేతలంతా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దుబ్బా, గ్రేటర్ లో మా విజయం తర్వాతే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కాస్తైనా ఆత్మగౌరవం పెరిగిందంటే ఆ ఘనత బీజేపీదే. తెలంగాణలో రైతు అనే పదానికి నిర్వచనాన్ని మార్చేసిన మూర్ఖుడు కేసీఆర్. ‘దున్నే వాడిదే భూమి' అనే నినాదాన్ని కాస్తా.‌‌. ‘పాస్ బుక్కు ఉన్నోడిదే భూమి' అనే స్థితికి తీసుకొచ్చాడు. అంతేకాదు..

కేసీఆర్ ఫ్యామిలీది కార్పొరేట్ కల్చర్

కేసీఆర్ ఫ్యామిలీది కార్పొరేట్ కల్చర్

బేసిగ్గా కార్పొరేట్ రైతైన కేసీఆర్ ఆయన కుటుంబం అనునిత్యం కార్పొరేట్లకు వంతపడుతూనే ఉంది. దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడు? కవిత, హరీష్ రావులు ర్పోరేట్ కాళాశాలల్లోనే తమ పెట్టుబడులు ఎందుకు పెడ్తున్నారు ? సాయంత్రమైతే కేటీఆర్ కార్పోరేట్ తరహా పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు? వచ్చే కమిషన్లన్నీ ఈ ముగ్గురే నొక్కేస్తుండటంతో రాష్ట్రంలోని ఇతర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూముల కబ్జాలకు పాల్పడుతూ జనాన్ని వేధించుకు తింటున్నారు. వీళ్లకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారు'' అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

  Bharat Biotech Seeks Emergency Approval for COVID vaccine
  English summary
  as trs party participated today's bharat bandh, telangana bjp mp Dharmapuri Arvind slams cm kcr for opposing new farm ats. speaking to media on tuesday, mp made sensational comments on cm kcr and his family.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X