• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ్రేటర్‌లో అమిత్ షా: వ్యూహం తెలుసా? -ఒకేదెబ్బకు 3సెగ్మెంట్లు - పాతబస్తీలో పూజలు -లష్కర్‌లో రోడ్ షో

|

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆదివారం హైదరాబాద్ హోరెత్తిపోయింది. దుబ్బాక ఫలితం ఊపుతో గ్రేటర్ లోనూ ధీటుగా ప్రచారం చేస్తోన్న బీజేపీ తమ అతిరథ నేతలను రంగంలోకి దింపింది. ఇంకొద్ది గంటల్లో ప్రచార పర్వానికి తెరపపనుండగా, కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ పర్యటన స్థానిక ఎన్నికల వేడిని మరింతగా రాజేసింది.

  #AmitShahInGHMC : Amit Shah's Roadshow Attracts Massive Crowd వ్యూహాత్మకంగా రూట్ మ్యాప్ | GHMC polls

  సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020

  అమిత్ షా @బల్దియా

  అమిత్ షా @బల్దియా

  స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న బీజేపీ.. కేంద్ర మంత్రి అమిత్ షా రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచే #AmitShahInGHMC హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేసింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగానైనా షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

  భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు

  భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు

  బేగంపేటలో అమిత్ షా ల్యాండ్ అయినప్పటి నుంచి, ఆయన పర్యటించిన అన్ని చోట్లా భారత్ మాతాకీ జై, జైశ్రీరామ్ నినాదాలు.. డప్పు చప్పుళ్లతో కాషాయ దళం సందడి చేసింది. బేగంపేట ఎయిర్ పోర్టు బయట కార్యకర్తలకు సంవాదం చేస్తూ బయలుదేరిన షా.. నేరుగా చార్మినార్ వద్దకు వెళ్లి, అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షా వెంట ఆయన డిప్యూటీ కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం పూజలో పాల్గొన్నారు. కాగా,

  వ్యూహాత్మకంగా రూట్ మ్యాప్

  వ్యూహాత్మకంగా రూట్ మ్యాప్

  గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా కోసం బీజేపీ వ్యూహాత్మక రూట్ మ్యాప్ తయారు చేసింది. గంటల వ్యవధిలోనే మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు(హైదరాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్)లోని డివిజన్లను ఆయన కవర్ చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజల తర్వాత మల్కాజ్ గిరి సెగ్మెంట్ పరిధిలోని ప్రాంతాలగుండా షా సికింద్రాబాద్ ఏరియాలోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహించారు.

  అనూహ్య భద్రత.. దుకాణాలు బంద్..

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో అనూహ్య భద్రత ఏర్పాటుచేశారు. ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చుట్టుపక్కల భారీగా కేంద్ర బలగాలను దింపారు. ఇటు లష్కర్ గా పిలుచుకునే సికింద్రాబాద్ లోనూ అదే పరిస్థితి. షా రోడ్ షో సందర్భంగా వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి వరకు అన్ని దుకాణాలను పోలీసులు గంటలపాటే మూసేయించారు. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఇబ్బంది పడ్డారు. రోడ్ షో అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో షా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ప్రచార గడువు ముగిసేలోపే ఆయన ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది.

  English summary
  As Hyderabad gears up for municipal elections, the BJP has ramped up efforts to persuade voters. Union Home Minister Amit Shah landed at hyderabad on Sunday. he began his tour by visiting bhagralaxmi temple at charminar. amit shah road show in secunderabad
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X