• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహంలో అమిత్ షా .. ఎలా స్కెచ్ వేశారో తెలుసా !

|
  తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం || Amit Shah Decided To Focus On Telangana || Oneindia

  2023 టార్గెట్ గా తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతోందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే అనే చెప్తున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు . ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిహ్ షా కూడా పక్కా స్కెచ్ తో తెలంగాణలో పాగా వెయ్యటానికి ఇప్పటి నుండే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ అమలులో ఉంది .

  తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ మాస్టర్ ప్లాన్

  తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ మాస్టర్ ప్లాన్

  తెలంగాణాపై ఫోకస్ పెట్టింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అధినాయకత్వానికి తెలంగాణాపై దృష్టి పెట్టేలా చేశాయి. మరోపక్క కాంగ్రెస్ బలహీనం కావటం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆటోమేటిక్ గా బలమైన క్యాడర్ అనేది పార్టీకి ఏర్పాటు అవుతుంది. ఒక్కసారి బలమైన క్యాడర్ వస్తే చాలు, రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ విజయబావుటా ఎలా ఎగరవేయాలో కమలనాథులకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. త్వరలో పెద్ద ఎత్తున పార్టీలోకి వలసలు ఉంటాయని కమలనాధులు చెప్తున్నారు.

  తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ చిన్న అంశం దొరికినా వదలొద్దని చెప్పిన అమిత్ షా

  తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ చిన్న అంశం దొరికినా వదలొద్దని చెప్పిన అమిత్ షా

  ఇక పార్టీ కోసం బలంగా పని చేసే నాయకులు ఎంత ముఖ్యమో ప్రజా క్షేత్రంలోకి బలంగా వెళ్ళటం కూడా అంతే ముఖ్యం , కేవలం వలసల వలన పార్టీ ఇమేజ్ పెరగదని బీజేపీ అధినాయకులకి తెలుసు, అందుకే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు చేయాలనీ అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నాడు. తాజాగా ఢీల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతలతో హోమ్ మంత్రి అమిత్ షా చర్చలు సాగించాడు. కేసీఆర్ పరిపాలనలో జరుగుతున్నా అక్రమాల గురించి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయండి అని పిలుపునిచ్చారు . ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ ఒక్క చిన్న అంశం దొరికిన వదలవద్దని ఆయన సూచించారు . మన పార్టీలో బలమైన నేతలను గుర్తించి వాళ్ళకి తగిన బాధ్యతలు అప్పగించండి.మన లక్ష్యం వచ్చే ఎన్నికల్లో తెలంగాణాల్ పాగా వెయ్యటం అని స్పష్టంగా సూచించారు.

  మీ మోసాలు బయటపెడతా .. ధైర్యముంటే సమాధానం చెప్పండి అని లోకేష్, చంద్రబాబులకు మంత్రి సవాల్

   తెలంగాణలో కేంద్రమంత్రులు ఎప్పటికీ పర్యటించే ప్లాన్ .. కేసీఆర్ టార్గెట్ గా పని చెయ్యాలని సూచన

  తెలంగాణలో కేంద్రమంత్రులు ఎప్పటికీ పర్యటించే ప్లాన్ .. కేసీఆర్ టార్గెట్ గా పని చెయ్యాలని సూచన

  అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నుండి ప్రతి పదిహేను రోజులకి ఒక కేంద్రమంత్రి పర్యటించేలా పక్క ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పారు . కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టి ప్రజలకి మనం దగ్గర అవ్వటానికి ఉన్న అన్ని మార్గాల్లో మనం ప్రయాణించాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారు . వచ్చే ఏడాది కాలంలో దాదాపు 52 మంది కేంద్ర మంత్రులు తెలంగాణ విజిట్ చేసేలా చేద్దామని, ప్రజల మద్దతు కూడగట్టటం ఇప్పటి నుండే యుద్ధ ప్రాతిపదికన జరగాలని ఆయన తెలిపారు. అలాగే ఈ సారి పార్టీ సభ్యత్వ నమోదు కూడా భారీగా జరగాలని కేంద్ర బీజేపీ పెద్దలు సృష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. రాబోవు రోజుల్లో కేసీఆర్ కి చెక్ పెట్టటానికి బీజేపీ భారీ ప్రణాళికనే సిద్ధం చేసింది. బీజేపీ అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి ఇప్పటి నుండే ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తే భవిష్యత్ లో బీజేపీ పుంజుకోవటం ఖాయంగా కనిపిస్తుంది.

  English summary
  BJP to focus on Telangana. The results of the Lok Sabha elections have given the BJP supremacy a focus on Telangana. On the other hand, the weakening of the Congress has also become an Advantage to the BJP. When the BJP comes to power, a strong cadre will automatically form the party. Once a strong cadre comes in, the BJP leaders know how to fly again and again in the state.That is why they are now working to recruit strong leaders from other parties. BJP leaders say that soon there will be a large-scale migration. Amit Shah has planned action plan on Telangana. He also called for a large-scale movement to address the irregularities in the KCR administration. He suggested not to find any single small item that would irritate the government. Identify the strongest leaders in our party and give them appropriate responsibilities.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more