హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనసూయ రియాక్షన్: ఈ సారి నెటిజన్లపై కాదు, మనం ఏం చేస్తున్నామని అంటూ..

|
Google Oneindia TeluguNews

యాంకర్ అనసూయ రూటు మార్చారు. అంటే నెటిజన్లపై విరుచుకుపడటమే కాదు.. ప్రకృతి విపత్తులపై కూడా స్పందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనపై రియాక్టయ్యారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో ప్రకృతి విపత్తు జరిగింది. ప్రకృతిని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ సహజీవనం చేయాల్సిన సమయం ఇకనైనా వస్తుందా? మనం గుణపాఠం నేర్చుకోవాలంటే ఇలాంటివి ఇంకెన్ని విపత్తులు చూడాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ప్రకృతి వైపరిత్యాలకు కారణమయ్యే కాలుష్యాన్ని నియంత్రించాలని అనసూయ కోరారు. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బుల్లితెర, వెండితెర కెరీర్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న అనసూయ పలు టీవీ షోస్ చేస్తున్నారు. దీంతోపాటు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే రవితేజ 'ఖిలాడీ' మూవీలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్తికేయ 'చావు కబురు చల్లగా' సినిమాలో కూడా అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బిజీగా ఉంటూనే.. ప్రకృతి విపత్తులపై అనసూయ స్పందించారు.

anchor anasuya reacts on uttarakhand glacier

మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తడంతో అక్కడి వాతావరణంలో పరిస్థితి దయనీయంగా మారింది.నదిపై నిర్మిస్తున్న పవర్‌ ప్రాజెక్టు ధ్వంసం కావడంతోపాటు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు 170 మంది పైగా ఆ వరదలో కొట్టుకుపోయారు. ఊహించని ఈ ప్రకృతి విపత్తు ప్రాణ, ఆస్తి నష్టం కలిగించింది. అక్కడి ప్రజలకు తీరని శోకం మిగిల్చింది.

English summary
anchor anasuya reacts on uttarakhand glacier. she request to people for save environment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X