హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కు మ‌రో అవార్టు..! స్వ‌చ్చ‌త ఎక్స‌లెన్సీ అవార్డుతో గౌర‌వించిన కేంద్రం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మ‌హా న‌గ‌ర శిఖ‌లో మ‌రో మ‌ణి హారం చేరింది. పాల‌నా ప‌రంగా మౌళిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌, ప్ర‌భుత్వ రంగ సేవ‌ల్లో నాణ్య‌త‌, న‌గ‌ర పాల‌న‌, మున్సిప‌ల్ వ్య‌వ‌స్థ, నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్యం, ర‌వాణా వ్య‌వ‌స్థ, కాలూష్య నిర్మూల‌న‌ త‌దిత‌ర రంగాల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ దూసుకెళ్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న జ‌నాబాని ద్రుష్టిలో పెట్టుకుని అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో న‌గ‌ర‌పాల‌క సంస్థ త‌న‌దైన ముద్ర వేసుకుంటోంది. ఇదే ప‌రంప‌ర‌లో న‌గ‌రానికి స‌ముచిత స్థానం కూడా ల‌భిస్తోంది.

Another award for Greater Hyderabad..! Respect for the Excellence Award..!!

గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది. హైదరాబాద్ నగరానికి 'స్వచ్ఛత ఎక్సలెన్సీ' అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాలలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. భాగ్యనగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే నగరానికి రెండు అవార్డులు రావడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే నగరానికి ఓడిఎఫ్‌ ప్లస్‌ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Greater Hyderabad received another award. The Central Swachatha Mission has announced the 'Purity Excellence' award to the City of Hyderabad. Hyderabad was awarded only to the metropolitan cities with a population of over 10 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X