హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో కరోనా బారిన పడిన మరో ఎమ్మెల్యే కుటుంబం... తాజాగా 2256 పాజిటివ్ కేసులు !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న తీరు తెలంగాణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 77,513 కరోనా కేసులు నమోదు కాగా 22, 568 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి . తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలపై కరోనా పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్

అధికార పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే కుటుంబం అంతా హోం ఐసోలేషన్

ఎమ్మెల్యే కుటుంబం అంతా హోం ఐసోలేషన్

ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంట మనిషికి కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి .తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణాలో కొత్తగా 2256 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan
 హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 2256 కరోనా కేసులు

హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 2256 కరోనా కేసులు


గడచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 615 కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు 77 ,513 కాగా యాక్టివ్ కేసులు 22,568 గా ఉంది .ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా బులెటిన్ ప్రకారం జీహెచ్ఎంసీలో 464, రంగారెడ్డిలో 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ లో 138, కరీంనగర్లో 101, గద్వాల్ లో 95, పెద్దపల్లి లో 84, కామారెడ్డిలో 76, సంగారెడ్డి లో 92 కేసులు నమోదయ్యాయి.

English summary
Corona is terrifing Telangana state. 2256 positive cases has been registered in the state in last 24 hours . cases increasing creates tension to the telangana people. major cases reported in GHMC premises. trs party lb nagar mla sudheer reddy and his family affected with corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X