హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలో మరో స్టీల్ బ్రిడ్జ్.!పంజాగుట్ట నుండి కేబీఆర్ పార్క్ వరకు నిరాటంక ప్రాయాణం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విశ్వనగరంగా ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం పంజాగుట్టలో 17 కోట్ల రూపాయల వ్యయంతో పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు ప్రారంభించారు.

 ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణం.. పంజాగుట్టలో మరో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం..

ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణం.. పంజాగుట్టలో మరో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం..

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి, సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి పోతాయని చెప్పారు.

 ఓ పక్క ఫ్లైఓవర్లు.. మరోపక్క స్టీల్ బిడ్జిలు

ఓ పక్క ఫ్లైఓవర్లు.. మరోపక్క స్టీల్ బిడ్జిలు

పాత గేట్ నుండి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుండి కే.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ప్రయాణం కొనసాగుతుందని వివరించారు. గ్రేవ్ యార్డ్ కు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ నుండి 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని చెప్పారు.

 మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ టాప్.. రహదారుల విస్తరణలో వేగం

మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ టాప్.. రహదారుల విస్తరణలో వేగం

ఇందులో మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నూతనంగా అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణం, పుట్ పాత్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని వివరించారు.

 నగర ప్రజలకు ఎన్నో వసతులు.. విశ్వనగరం దిశగా పరుగులన్న మంత్రి శ్రీనివాస యాదవ్

నగర ప్రజలకు ఎన్నో వసతులు.. విశ్వనగరం దిశగా పరుగులన్న మంత్రి శ్రీనివాస యాదవ్

అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వీటితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోని ఇతర నగరాల కన్నా హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

English summary
Talsani Srinivas Yadav, Minister of State for Livestock, Fisheries and Dairy Development and Cinematography, said that the government will take a number of steps to control the ever-increasing traffic in the fast-growing city of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X