హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి.. ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంలు.. చంద్రబాబు, బీజేపీపైనా చర్చలు

|
Google Oneindia TeluguNews

విభజన సమస్యలకుతోడు ఆంద్రప్రదేశ్ లో రాజధాని వివాదం, పౌరసత్వ సవరణ, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు తదితర కీలక పరిణామా నడము రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు వైపులకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు.

సాదర స్వాగతం.. సాయిరెడ్డి చర్య..

సాదర స్వాగతం.. సాయిరెడ్డి చర్య..

సంక్రాతి అలంకరణతో మెరిసిపోతోన్న ప్రగతి భవన్ కు జగన్ రాగానే.. కారు దగ్గరికి వెళ్లిమరీ కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పట్టువస్త్రం కప్పి, పూలబొకే అందించి.. ఇంట్లోకి తీసుకెళ్లారు. అంతలోనే వెనుక నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వస్తుండటాన్ని గమనించిన కేసీఆర్.. అటువైపు తిరిగారు. వెంటనే విజయసాయిరెడ్డి కిందికి వంగి కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఆయన భుజంపట్టి పైకి లేపిన కేసీఆర్.. సాయిరెడ్డినీ లోపలివైపునకు నడిపించారు. కేసీఆర్ పట్ల తన భక్తిభావాన్ని ఏనాడూ దాచుకోని విజయసాయిరెడ్డి గతంలోనూ పలు మార్లు పాదాభివందనం చేశారు.
కాగా, భేటీకి సంబంధించి వైసీపీ విడుదల చేసిన వీడియోల్లో మాత్రం కాళ్లుమొక్కే సీన్లను ఎడిట్ చేయడం గమనార్హం.

మటన్ బిర్యానీ.. చేపల పులుసు.. పాలకూర పప్పు..

మటన్ బిర్యానీ.. చేపల పులుసు.. పాలకూర పప్పు..

కలయికలో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి లంచ్ చేశారు. జగన్ కోసం ఆయనకు ఇష్టమైన వంటకాల్ని ప్రిపేర్ చేయించినట్లు తెలిసింది. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చేపల పులుసు లాంటి నాన్ వెజ్ రుచులతోపాటు పాలకూర పప్పు, ఆలూ ఫ్రై, సాంబార్ తదితర వెజిటేరియన్ పదార్థాలనూ అదుబాటులో ఉంచారు.

భేటీలో పాల్గొన్నది వీళ్లే..

ఏపీ సీఎంతోపాటు ప్రగతి భవన్ కు వచ్చినవాళ్లలో ఎంపీ విజయసాయి రెడ్డితోపాటు మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులున్నారు. జగన్ ఏపీ సీఎం అయిన కొత్తలో అప్పటి గవర్నర్ నరసింహన్ సూచనమేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెగ్యులర్ గా కలిసి, విభజన సమస్యల పరిష్కారానికి చర్చలు చేయడం మొదలైన సంగతి తెలిసిందే.

ఏం చేద్దాం.. ఎలా అడ్డుకుందాం..

ఏం చేద్దాం.. ఎలా అడ్డుకుందాం..

ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీజలాల పపకం, విద్యుత్ ఉద్యోగుల విభజన, రీఆర్గనైజేషన్ యాక్టులోని పలు సమస్యలు చర్చకు వచ్చాయి. అలాగే, ఏపీ రాజధాని వివాదం, జాతీయ రాజకీయాలపైనా కీలక సంవాదాలు జరిగినట్లు తెలిసింది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై చంద్రబాబు చేస్తోన్న లొల్లి, రాష్ట్రాలు అంగీకరించకున్నా సీఏఏ అమలు చేస్తామంటోన్న బీజేపీ సర్కారును ఎలా నిలువరించాలనేదానిపై కేసీఆర్, జగన్ మాట్లాడుకున్నట్లు సమాచారం.

English summary
Andhra Pradesh chief minister YS Jagan Mohan reddy meets Telangana Chief minister KCR on monday in Hyderabad. After lunch, both CMs discussed on bifurcation and several political issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X