హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఎమ్మెల్యే కొడుకా మజాకా.. పోలీసులపైనే దాడి.. అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎమ్మెల్యే కొడుకుననే దర్పం, తనకు నిబంధనలు వర్తించవని ఊహల్లో మునిగితేలాడు. చట్టం ముందు తాను సమానమేనని గుర్తించక పోలీసులపై దాడికి తెగబడ్డాడో ఎమ్మెల్యే పుత్రరత్నం. ఈ దారిలో వెళ్లొద్దు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెబితే వినిపించుకోలేదు. సర్దిచెప్పబోయిన సీఐనే కాలితో తన్ని తన తలపొగరు బయటపెట్టాడు. హైదరాబాద్ నడిబొడ్డున గల మాదాపూర్‌లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశమైంది.

ఎమ్మెల్యే కొడుకు దాష్టీకం
మనం ఇందాకా చెప్పుకుంది జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ గురించే. ఇతగాడు హైటెక్ సిటీ సమీపంలోని మీనాక్షి టవర్స్‌లో ఉంటున్నాడు. నిన్న సాయంత్రం నోవాటెల్‌కు వెళ్లి తిరిగొస్తున్నాడు. అయితే ఖానామెట్ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో హైటెక్స్ కమాన్ వైపు నుంచి వస్తున్న వాహనాలను కొద్దిసేపు ఆపివేశారు. అయితే అటుగా ఎమ్మెల్యే పుత్రరత్నం కారు వస్తోంది. పోలీసులు చెప్తున్న పట్టించుకోవడం లేదు. ముందుకు వెళ్లడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపాడు. ఇంకేముంది ఎమ్మెల్యే కొడుకుకు ఎక్కడాలేని కోపం వచ్చినట్టుంది. తాను ప్రజాప్రతినిధి కుమారుడినని తనకు నిబంధనలు వర్తించవనే విధంగా ప్రవర్తించాడు.

ap mla son samineni ventaka krishan prasad kick ci

వెళ్లొద్దంటే గొడవ
ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఈ వైపు నుంచి వెళ్లొద్దని కానిస్టేబుల్ చెప్పాడు. అయితే ఎమ్మెల్యే పుత్రరత్నాన్ని నువ్వు అనడంతో కోపం వచ్చింది. కానిస్టేబుల్‌ను అసభ్యపదజాలంతో దూషించాడు. గొడవను గమనించిన సీఐ రాజగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందని ఆరాతీశాడు. అయినా ప్రసాద్ వినిపించుకోలేదు. దీంతో స్టేషన్‌కు రమ్మని కోరడంతో ప్రసాద్‌కు మరింత కోపమొచ్చింది. నన్ను స్టేషన్ రమ్మంటావా అని సీఐని పక్కకు నెట్టేశాడు. కాలితో తన్ని దూషించాడు. అక్కడ ఉన్న మిగతా పోలీసుల సహకారంతో ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. తమను అసభ్యపదజాలంతో దూషించడమే గాక దాడి చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసాద్‌పై 332. 353. 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
Venkata Krishna Prasad is staying at Meenakshi Towers near Hi Tech City. Returning to Novatel yesterday evening. However, congestion at the Meenakshi Skylange in Khanamet Chowrasta was over. Vehicles coming from the side of Hi tex Commons were stopped for a while. But then comes the car of the MLA's son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X