హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్ కోసం 2 వారాల్లో దరఖాస్తు.. ప్రధాని మోడీతోనూ చెప్పిన పునావాలా..

|
Google Oneindia TeluguNews

ఎమర్జెన్సీ చికిత్స అందించేందుకు వ్యాక్సిన్ తీసుకోవడానికి రెండువారాల్లో దరఖాస్తు చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఇప్పటికే సీరం చీఫ్ అదర్ పునావాలా తెలుపగా.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ చికిత్సకు సంబంధించి వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ను ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అస్ట్రాజెనెకా డెవలప్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూలై వరకు 400 మిలియన్ డోసుల వరకు డెవలప్ చేస్తామని అదర్ పునావాలా తెలిపారు.

 Applying For Emergency Use Of Covid Vaccine In 2 Weeks

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం రివ్యూ చేయడానికి ప్రధాని మోడీ పుణె వచ్చారు. అదర్ పునావాలాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ డెవలప్ కోసం సవాళ్లు, చాలెంజ్, రోడ్ మ్యాప్ గురించి చర్చించారు. వ్యాక్సిన్ తయారీపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోకస్ చేశారు. ఇవాళ మూడు నగరాల్లో పర్యటిచి వ్యాక్సిన్ గురించి స్వయంగా తెలుసుకున్నారు. గుజరాత్‌లోని క్యాడిలా ప్లాట్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ సందర్శించారు.

వ్యాక్సిన్ నాణ్యత, భద్రత గురించి ప్రధాని మోడీ చర్చించారని పునావాలా తెలిపారు. సమర్థత, శక్తి ఉన్న 18 ఏళ్ల వయస్సు గల వారికి పరీక్షలు చేశారు. నెలకు 50 నుంచి 60 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని పునావాలా తెలిపారు. జనవరి తర్వాత 100 మిలియన్ డోసులు ప్రొడక్ట్ చేస్తామని చెప్పారు.

English summary
Serum Institute will apply within two weeks for the emergency use of the coronavirus vaccine being developed by the University of Oxford and pharma giant AstraZeneca.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X