హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారా..! తేడా వ‌స్తే జైలుకు కూడా వెళ్తారు.. జాగ్ర‌త్త‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ :రోజులు మారాయి. సాంకేతిక‌త మారుతోంది. ఒక‌ప్పుడు స్నేహితున్ని ప‌ల‌క‌రించ‌లంటే ఉత్తరాలు రాసుకునే వాళ్లు. మ‌రీ కావాలంటే బ‌స్సుల్లో ప్ర‌యాణించి స్నేహితుల‌ను క‌ల‌సుకునే వాళ్లు. ఇప్పుడు అలా కాదు. వాట్సాయాప్.. వీడియోకాల్.సింపుల్. క్షేమ స‌మాచారం అంతా స్మార్ట్ ఫోల్ లోనే..! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇదే గ్రూపుల్లో ఏమాత్రం తేడా చేసే పోస్టులు పెట్టినా అందుకు గ్రూప్ అడ్మిన్ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వివాదాస్పద పోస్టులు చేస్తామంటే ఇక చెల్లదు. నా గ్రూపుల్లో నేను ఏ సమాచారం షేర్ చేస్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

గ్రూపులో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్ట‌కండి..! అడ్మిన్ ను జైలుకు పంప‌కండి...!!

గ్రూపులో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్ట‌కండి..! అడ్మిన్ ను జైలుకు పంప‌కండి...!!

అత్యుత్సాహంతో పోస్టులు పెట్టి, అవాకులు చెవాకులు పేల్చే వారికి శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గప‌డుతుండ‌డంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవలే నామినేషన్ల పర్వం పూర్తయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్ప మిగితా పార్టీల వారు పోటీకి ఆసక్తి కనబరచలేదు. బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండ్‌లో సోషల్ మీడియా కీలకంగా మారింది.

రాజ‌కీయ పోస్టులు పెడుతున్నారా..? మోతాదు మించితే వీపు విమానం మోతే..!!

రాజ‌కీయ పోస్టులు పెడుతున్నారా..? మోతాదు మించితే వీపు విమానం మోతే..!!

ఆశావహులు సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ అభ్యర్థుల హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడి కనిపిస్తోంది. అభ్యర్థులు, పార్టీలు ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టినవారితో పాటు గ్రూపు అడ్మిన్‌పై చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సోషల్ మీడియా ఖర్చులపై నిఘా.. అభ్యర్థుల ప్రకటనలపై ఈసీ కన్నుసోషల్ మీడియా ఖర్చులపై నిఘా.. అభ్యర్థుల ప్రకటనలపై ఈసీ కన్ను

 ఫిర్యాదు అందితే చ‌ర్య‌లు తీసుకుంటాం..! సోష‌ల్ మీడియా పై నిఘా పెట్టామ‌న్న పోలీసులు..!!

ఫిర్యాదు అందితే చ‌ర్య‌లు తీసుకుంటాం..! సోష‌ల్ మీడియా పై నిఘా పెట్టామ‌న్న పోలీసులు..!!

అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదులు వస్తే కేసులు పెడతామని అధికారులంటున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు అదికారులు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఎక్కువగా సాగుతుండడంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. అశ్లీల సమాచార, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసేవారు జైలుశిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది.

 వివాదాస్ప‌ద పోల్టులు పెడితే ఇబ్బందే..! ఐటి చ‌ట్టం కింద అడ్మిన్ కి జైలే..!!

వివాదాస్ప‌ద పోల్టులు పెడితే ఇబ్బందే..! ఐటి చ‌ట్టం కింద అడ్మిన్ కి జైలే..!!

అదే నేరానికి రెండోసారి పాల్పడితే పదేళ్లు జైలు, 2 లక్షల రూపాయ‌ల‌ వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి. పోస్టులు పెట్టే అడ్మిన్‌లతో పాటు వాటిని షేర్ చేసేవారిని కూడా బాధ్యులను చేసే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్టప్రకారం ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అపరిచితులను గ్రూపులో చేర్చుకోకపోవడమే ఉత్తమం. వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారనే విషయాన్ని అడ్మిన్‌లతో పాటు గ్రూపులలోని సభ్యులూ తెలుసుకుని మసులుకోవాలి. విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు, తప్పుడు, తెలియని సమాచారం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, ఓ వర్గాన్ని బాధించే ఏ విషయాన్ని పోస్టు చేయకపోవడమే మంచిది.

English summary
Officers warn of putting inappropriate posts and avoiding punishment from police officials. The groups of admin groups need to be careful in this background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X