• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అయ్యా.. దండాలు... ఇప్పటికీ గరిబోడు గుర్తొచ్చాడా.. కేసీఆర్‌పై షర్మిల నిప్పులు

|

సీఎం కేసీఆర్ ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా రోగులతో మాట్లాడి.. వారిలో ధైర్యం నింపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు చురకలంటించాయి. కోర్టులు తిడితే తప్పా తెలివి రాదా అంటూ ఫైరయ్యారు. వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేసీఆర్ వైఖరిని ఆమె ఎండగట్టారు. తీరు మార్చుకోరా అంటూ హితోపదేశం చేశారు. జనం మర్లపడితే తప్ప మీరు పనులు చేయరని ఫైరయ్యారు. కానీ ఇప్పటికైనా గరిబోడి ఆపతి గుర్తించినందుకు దండాలు కేసీఆర్‌ దొర అంటూ సెటైర్లు వేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ సరే.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.

 26 లక్షల కుటుంబాలే

26 లక్షల కుటుంబాలే

ఆయుష్మాన్‌ భారత్‌ వలన లబ్దిపొందేది కేవలం .. 26 లక్షల 11 వేల కుటుంబాలు మాత్రమే, తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు వైట్‌ రేషన్‌ కార్డు ద్వారా బెన్ఫిట్‌ పొందుతున్నవారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోని వారిని కూడా .. మా ప్రభుత్వం పేదలుగా గుర్తించి వారి భారాన్ని మోస్తుంది అని చెప్పుకొన్న మీ ప్రభుత్వానికి .. ఇప్పుడు మిగితా కుటుంబాలు పేదలుగా కనిపించకపోవడం దారుణం అన్నారు. పేదవారిని గుర్తించే మీరు వైట్‌ రేషన్‌ కార్డు జారీచేశారు, ఇప్పుడు మళ్ళి పేదరికంలో తేడాలు చూడటం సరికాదన్నారు. కాబట్టి కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చి అన్ని పేద కుటుంబాలకు లాభం చేకూర్చాలని డిమాండ్ చేశారు.

 5 లక్షల మందికే

5 లక్షల మందికే

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా సంవత్సరానికి .. 5 లక్షల వరకే బెన్ఫిట్‌ పొందే అవకాశం ఉంది, ఆరోగ్యశ్రీ ద్వారా మనం కొన్ని వ్యాధుల చికిత్సలకు 13లక్షల వరకు చెల్లించుకొంటున్నాం( కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్‌), రాష్ట్ర పరిధిలో ఉండి రేపు ఎక్కువ మొత్తంలో చెల్లించుకొనే అవకాశం ఉన్న ఆరోగ్యశ్రీ లోనే కరోనా ను చేర్చాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ లో 1350 వ్యాధులకు చికిత్స లభిస్తుండగా .. అందులో లేని 540 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స లభిస్తుందన్నారు. ఇప్పుడు కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చకుండా .. ఆయుష్మాన్‌ భారత్‌ లో చేర్చడం చూస్తుంటే రేపు రాష్ట్రంలో అమలౌతున్న ఆరోగ్యశ్రీని పక్కనపెట్టి పూర్తిగా రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ నే అమలు చేస్తారనే అనుమానం కలుగక మానదు .. కాబట్టి దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.

తెల్ల రేషన్ కార్డు

తెల్ల రేషన్ కార్డు

పేదలను గుర్తుంచుకొనే వారికీ వైట్‌ రేషన్‌ కార్డులు ఇచ్చుకొన్నామని చెప్పారు. అదే పేదలకు మనం కొత్త అర్ధం వెతుకుతున్నామా అనేది ఆలోచించుకోవాలి,
బైక్‌ .. ఫోన్‌ లేనివారు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు? అవి బేసిక్‌ అవసరాలుగా ఉన్నవని చెప్పారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో కరోనా వైద్యం చేయించుకొనేంత స్థోమత వాళ్లకు ఉంటుందా? అని అడిగారు. పేదలు అని గుర్తించే మీరు .. వైట్‌ రేషన్‌ కార్డు ఉన్నోళ్లందరికి రేషన్‌ బియ్యం సప్లై చేస్తున్నారు, వైద్యానికి డబ్బులు చెలించాల్సి వచ్చే సరికి వాళ్ళు పేదవాళ్ళు కాకుండా పోయారా? అని అడిగారు.

డబుల్ బెడ్ రూం..

డబుల్ బెడ్ రూం..

మట్టి గోడల ఇండ్లు ఉన్నవాళ్ళకే .. ఆయుష్మాన్‌ భారత్‌ వర్తిస్తుంది అని ఉంది .. పేదలకు పక్కా ఇండ్లను కట్టించాలనే నిర్ణయంతో .. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కట్టిస్తున్నారుగా అని అడిగారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు తీసుకొన్నోలంతా పేదలు కదా? అనేది మీరే చెప్పాలన్నారు. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్‌ భారత్‌ లో కరోనా ను చేర్చి అమలు చేస్తునందున.. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ లోను కరోనా ను చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.
ఇప్పటికే ఆరోగ్య శ్రీ డబ్బులు సరిగా చెల్లించడం లేదని .. ప్రైవేట్‌ హాస్పిటల్‌ వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నాయని షర్మిల తెలిపారు. హైదరాబాద్‌ నుంచే వచ్చే డబ్బులే సరిగా రావడం లేదు .. ఢిల్లీ నుంచి వచ్చే వాటికీ టైం అంటూ ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. బీబీ నగర్‌ లోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌ ప్రారంభంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత లేక ఆగిపోవడం గురించి ప్రస్తావించారు.

సచివాలయం అలా..

సచివాలయం అలా..

సెక్రటేరియట్‌ కు రాని మీరు .. ఓకే బడ్జెట్‌ లో దానికి కావాల్సిన మొత్తాన్ని రిలీజ్‌ చేశారన్నారు. పేదల వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టె పరిస్థితి వచ్చేసరికి ..
పేదల్లో .. నకిలీ, అసలు పేదోళ్లను వెతికే ప్రయత్నం చేస్తున్నట్లుంది మీ నిర్ణయం అని అన్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాం అని చెప్పారు. పేదల పై ప్రేమ ఉంటే .. పేదలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే .. కరోనా ను ఆయుష్మాన్‌ భారత్‌ తో పాటు ఆరోగ్య శ్రీ లో కూడా చేర్చి రాష్ట్రంలోని 80 లక్షల పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

English summary
ys sharmila slams cm kcr on coronavirus issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X