• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: తెలంగాణలో థియేటర్లు బంద్ -సర్కారు వద్దన్నా వినని ఎగ్జిబిటర్లు -పవన్ ‘వకీల్ సాబ్’‌కు మినహాయింపు

|

విశ్వనగరం హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభణ ఉధృతంగా సాగుతుండటం, కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్న దరిమిలా, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్ సర్కారు కీలక చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూతో నూరుశాతం ప్రతికూల ప్రభావం లేనప్పటికీ సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి..

సర్కారు వద్దన్నా బంద్..

సర్కారు వద్దన్నా బంద్..

రాష్ట్రంలో కొవిడ్ రెండో వేవ్ మొదలైనప్పటి నుంచీ సినిమా థియేటర్ల మూసివేత అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్' సినిమాకు ప్రేక్షకులు పోటెత్తడం, సినిమా ఫంక్షన్ లో వైరస్ వ్యాప్తి చెందడం లాంటి పరిణామాల తర్వాత ప్రభుత్వం తీరుపై విమర్శలూ వచ్చాయి. కానీ, సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్ల మూతకు ఆదేశాలు ఇవ్వబోమని, సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిరోజుల కిందట స్పష్టం చేశారు. మంగళవారం నాటి కర్ఫ్యూ ఉత్తర్వుల్లోనూ సినిమా థియేటర్లను పూర్తిగా మూసేయాలని సర్కారు ఎక్కడా పేర్కొనలేదు. అయితే,

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం..

తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం..


తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై జారీ అయిన నిబంధనల ప్రకారం సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర కమర్షియల్ సముదాయాలు రాత్రి 8 గంటల వరకే తెరిచుంటాయి. ఆ మేరకు సినిమాల ఫస్ట్, సెకండ్ షోలపై మాత్రమే ప్రభావం ఉంటుంది. థియేటర్లను పూర్తిగా మూసేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కానప్పటికీ సినిమా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు మూకుమ్మడిగా థియేటర్లు మూసేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, థియేటర్లను మూసేయాలనే తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. అయితే..

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

పవన్ ‘వకీల్ సాబ్’‌ తప్ప..

పవన్ ‘వకీల్ సాబ్’‌ తప్ప..


కరోనా వైరస్ ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో థియేటర్లను మూసేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే విడుదలై, పెద్ద ఎత్తున ప్రదర్శిస్తోన్న పవన్ కల్యాణ్ సినిమా ‘వకీల్‌ సాబ్‌' కు మాత్రం మూసివేత నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అసోసియేషన్లు పేర్కొన్నాయి. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ అవుతాయని, ఒక్క వకీల్ సాబ్ సినిమా నడుస్తోన్న థియేటర్లలో మాత్రమే ప్రదర్శనలు కొనసాగుతాయని వారు తెలిపారు.

English summary
With the alarming rise in the Covid-19 cases, the theatres in Telangana state have been shut. The Telangana Cinema Theatre Owners Association has voluntarily announced that the cinemas would remain shut until the situation comes to normalcy. The single-screen theatres, the multiplexes and single plexus will be shut following the decision. only pawan kalyan's vakeel saab movie will be exempted. Meanwhile, the AP government has limited it to the 50 percent occupancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X