హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్‌లాక్ ప్రక్రియతో పుంజుకున్న వాహనాల సేల్స్.. రికార్డు స్థాయిలో అవే..!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనజీవనం తిరిగి మామూలు స్థితి చేరుకుంటోంది. అన్ని రంగాల్లోనూ చలనం మొదలైంది. ముఖ్యంగా సేల్స్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. లాక్ డౌన్ లో పూర్తిగా చతికిల బడ్డ వాహనరంగం ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో వాహనాల కోనుగోళ్లు పెరిగినట్లు సమాచారం.

Recommended Video

Two Wheeler Sales Rise During CoronaVirus Lockdown సొంత వాహనాల కోసం చూస్తున్న జనాలు....!!
 పెరిగిన వాహనాల వినియోగం

పెరిగిన వాహనాల వినియోగం

ప్రజారావాణా వ్యవస్థపై ఇంకా ఆంక్షలు కొనసాగుతుంటడంతో పాటూ సొంత వాహనాల ఉపయోగం విరివిగా పెరిగింది. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనాలు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ కానీ ఇటు షేర్ ఆటోలను ఆశ్రయించడం కానీ చేయడం లేదు. ఇంకా ప్రజల్లో కరోనా భయం పూర్తిగా వీడలేదు.

 టూ వీలర్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రజలు

టూ వీలర్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రజలు

అన్ లాక్ ప్రక్రియతో కార్యాలయాలు తిరిగి తెరచుకుంటున్నాయి. క్రమంగా జనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఫుల్ స్టాప్ పెట్టి, విధులకు హాజరవుతున్నారు. అయితే, ఇందుకోసం ఎక్కువగా టూ వీలర్స్ నే ఆశ్రయిస్తున్నారు. మెట్రో మొదలైనా ఇప్పటికీ ముప్పై శాతం మంది కూడా ప్రయాణించడం లేదు. సిటీ బస్సులు మొదలైనప్పటికీ సొంత వాహనాల మీద వెళ్లడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో వాహనాల కొనుగోళ్లూ గణనీయంగా పెరిగాయి.

 ఒక్క నెలలోనే 18 లక్షల వాహనాలు

ఒక్క నెలలోనే 18 లక్షల వాహనాలు

కోవిడ్ తర్వాత ఆటోమొబైల్ రంగం కుదేలవుతుందనుకున్నప్పటికీ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ వస్తుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సొంత వాహనాలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దాదాపుగా హీరో మోటార్స్ టీవీఎస్ మోటార్స్ ..రాయల్ ఎన్ ఫీల్డ్...బజాజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఒక్క నెలలోనే దాదాపు 18 లక్షల టూవీలర్స్ ను విక్రయించాయి. 2019 కన్నా 2020 సెప్టెంబర్ లో యాభై శాతం కన్నా ఎక్కువ అమ్మకాలు జరిగినట్ట తెలుస్తోంది. ఇన్ని రోజులు వాహన షోరూం లు మూసివేసి ఉండడం..ఇప్పుడిప్పుడే జనం సాధారణ జీవితాన్ని మొదలు పెడుతుండడంతో సేల్స్ పెరిగినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు.

English summary
As the Unlock process have begun and the public transport had opened, People are still not ready to travel in these instead opting for own vehicles. In this back drop, two wheeler sales have hit a record high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X