హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కరోజులో 15 బాటిళ్ల రక్త దానం : ఓవైసీ వ్యాఖ్యలు చక్కర్లు

|
Google Oneindia TeluguNews

ఒక మనిషి ప్రతి మూడు నెలలకు ఒక బాటిల్ రక్తం ఇవ్వడమే సాధ్యమవుతుంది. కాని ఒక్క రోజులో 15 బాటిళ్ల రక్తాన్ని ఇచ్చానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన లాజిక్ లేకుండా మాట్లాడిన మాటలు పలు సందేహాలను లేవనెత్తున్నాయి. దీంతో ఆయన మాట్లాడిన వీడీయో సోషల్ మీడీయాలో వైరల్‌గా మారాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్‌ఐఎమ్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన వీడీయో సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఆయన రక్తదానం గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ సంధర్భంలోనే ఎక్కడో ఓచోట జరిగిన ఆందోళనల్లో ఒకరికి రక్తం అవసరమైందని , దీంతో ఓ పాజిటీవ్ రక్తం కావాలని డాక్టర్ అడిగాడని చెప్పారు. దీంతో తనది కూడ ఓ పాజీటివ్ రక్తం కావడంతో ఓవైసీ వెంటనే స్పందించానని చెప్పారు. అయితే అంతటితో ఆగకుండా తాను ఆరోజు పదిహేను బాటిళ్ల రక్తాన్ని ఇచ్చానని చెప్పుకోచ్చారు. ఓ వైపు రక్తం ఇస్తూనే మరోవైపు రోగుల వెంట రక్తపు బాటిళ్లు పట్టుకుని పరుగెత్తానని చెప్పారు. ఇందుకు దేవుడే సాక్ష్యం అని అన్నారు.

Asaduddin Owaisis comments has gone viral on social media

అయితే మనిషి ఒకేరోజు 15 బాటిళ్ల రక్తం ఇవ్వడం సాధ్యపడదని ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే కాని అసదుద్దిన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడీయాలో వైరల్ అవుతున్నాయి. తాను స్పష్టంగా పదిహేను బాటిల్స్ ఇచ్చానని చెప్పాడం పై నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అయితే తాను ఏ సంధర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎక్కడ చేశారనే దానికి స్పష్టత మాత్రం లేదు. కాగా రెండు రోజుల క్రితమే ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేసినట్టు వీడీయో హల్‌చల్ చేసింది. కాని తాను డాన్స్ చేయలేదని ఓవైసీ వివరించారు.

English summary
Hyderabad MP Asaduddin Owaisi's comments has gone viral on social media. that he gave 15 bottles of blood in one day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X