హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రోల్ అయిపోయినా 100కు డయల్ చేయండి... సీపీ సజ్జనార్

|
Google Oneindia TeluguNews

ప్రియాంక రెడ్డి హత్య ఉదంతంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళలకు ఏ ఆపద వచ్చినా 100కు డయల్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. చివరకు పెట్రోలో అయిపోయినా కాల్ చేయాని అన్నారు. ఫోన్ తర్వాత అయిదు నిమిషాల్లోనే చేరుకుంటామని ఆయన తెలిపారు. 100 తో పాటు పలు ఇతర నంబర్లను ఆయన చెప్పారు. వాటికి కాల్ చేయాలని విజ్ఝప్తి చేశారు.

ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత: మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డగించి, స్థానికుల ఆగ్రహంప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత: మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డగించి, స్థానికుల ఆగ్రహం

ప్రియాంక ప్రాణం ఖరీదు అమాయకత్వమేనా...

ప్రియాంక ప్రాణం ఖరీదు అమాయకత్వమేనా...


ప్రియాంక రెడ్డి ఉదంతంలో ఆమె అమాయకత్వమే ప్రాణం మీదకు తీసుకువచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి... ఉన్నత చదువులు చదువుకున్న ప్రియాంక అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేయలేక పోయింది. ప్రమాదం ముంచుకువస్తే ఏం చేయాలనే కనీస అవగాహన లేకపోవడం కూడ ఆమె హత్యకు కారణమని చెబుతున్నారు. ఇదే అంశాన్ని మంత్రులు సైతం వెళ్లడించారు. కనీసం 100 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బయటపడేదని... ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన హోంమత్రి మహమూద్ ఆలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఉన్నత చదువులు..చేతిలో ఫోన్...

ఉన్నత చదువులు..చేతిలో ఫోన్...

చివరికి ఫోన్ చేతిలో ఉండి... తనకంటే చిన్నదైన చెల్లెలికి ఫోన్ చేసి 20 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడిన ప్రియాంక...ఒక్క నిమిషంలో తనను రక్షించే పోలీస్ వ్యవస్థకు ఫోన్ చేయలేక పోయిందనే అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది.. ఇరవై నిమిషాల పాటు సోదరితో మాట్లాడుతూ భయాన్ని వ్యక్తం చేసిన ప్రియాంక ఒక్క నిమిషం పాటు డయల్ 100కు ఫోన్ చేయాల్సి ఉండేదని అంటున్నారు.. ఇక రాత్రి 9 గంటలకు బయటకు వచ్చిన ఆమె అంతే ధైర్యంతో నిందితుల కుట్రలను పసిగట్లలేక పోయిందనే పరిస్థితి కూడ కనిపిస్తుంది. . కాగా ప్రియాంకకు ఇలాంటీ అంశాలపై అవగాహన లేదని కూడ ఆమె తండ్రి చెప్పడం గమనార్హం.

అపదలో ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి

అపదలో ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి

దీంతో సీపీ సజ్జనార్ మహిళలకు ఎలాంటీ సమస్యలు ఉన్నా... ఏం జరిగినా... చివరికి పెట్రోల్ లేకున్నా 100కు ఫోన్ చేయాలని.. కోరారు.. పోన్ చేసిన తర్వాత.... కేవలం అయిదు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం పోలీస్ వ్యవస్థలో ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. దీంతోపాటు ఇతర ఫోన్ నెంబర్లు సైతం ఆయన వెళ్లడించారు. వాటిలో 100 తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 112, 1090, 1091, తోపాటు ఇతర షీ బృందాలకు ఏర్పాటు చేసిన 040-27852355 నంబర్లకు కాల్ చేయాలని చెప్పారు.

English summary
after Priyanka Reddy murder alerted the police. CP Sajjanar suggested that women should dial 100 if there is any danger even if petrol over in bikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X