• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నడిరోడ్డుపై కత్తుల వీరంగం.. హైదరాబాద్‌లో దారుణ హత్య.. పేగులు చేతబట్టుకుని బాధితుడి పరుగులు

|

హైదరాబాద్ : బుధవారం సాయంత్రం. వాహనాలు, పాదచారులు.. అలా వచ్చీపోయే వారితో పంజాగుట్ట చౌరస్తా కిటకిటలాడుతోంది. ఓ ఆటో డ్రైవర్ మరో ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేయడం.. అతడు ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టడం సినిమా సీన్ తలపించింది.

భాగ్యనగరం నడిబొడ్డున మరోసారి కత్తులు వీరంగం చేశాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య నెలకొన్న ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. చంపడానికి ఒకరు.. ప్రాణాలు దక్కించుకోవడానికి మరొకరు రోడ్లపై పరుగులు పెడుతుంటే వాహనదారులు, పాదచారులు భయంతో వణికిపోయారు. దాంతో వారు కూడా పరుగులు పెట్టిన పరిస్థితి కనిపించింది.

పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తుపోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు

నగరం నిద్రపోని వేళ..!

నగరం నిద్రపోని వేళ..!

హైదరాబాద్‌లో దారుణ హత్య జరగడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్లపై ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. ఒకరి చేతిలో కత్తి ఉండగా మరొక వ్యక్తి ప్రాణభయంతో కనిపించాడు. చివరకు కత్తిపోట్లకు గురైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌కు కూతవేటు దూరంలో జరిగిన ఈ హత్య భయాందోళన రేకెత్తించింది. అటుగా వెళుతున్న వాహనదారులు, పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు.

ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. పంజాగుట్ట సమీపంలో నివసించే 32 ఏళ్ల అన్వర్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పత్రాప్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల రియాసత్ అలీ కూడా కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు ఓ మహిళ కారణంగా తెలుస్తోంది.

 వెంటపడి.. వేటాడి..! పేగులు బయటపడ్డా కూడా..!

వెంటపడి.. వేటాడి..! పేగులు బయటపడ్డా కూడా..!

ఓ మహిళతో అక్రమ సంబంధం ఈ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు రాజేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే బుధవారం సాయంత్రం పంజాగుట్ట ఆటో స్టాండ్‌లో ఉన్న అన్వర్‌ను రియాసత్ అలీ టార్గెట్ చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి పొట్టలో పొడిచాడు. ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన అన్వర్ వెంటనే తేరుకుని ప్రాణభయంతో పరుగెత్తాడు.

అన్వర్ అలా పరుగెత్తుతున్నా.. రియాసత్ అలీ వెంటపడి మరీ పొడిచాడు. ఎక్కడా లేని కసితో ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశాడు. అన్వర్ అలా పరుగెత్తుకుంటూ సమీపంలోని పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్ కౌంటర్‌లో కుప్పకూలిపోయాడు. అప్పటికే పేగులు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావమైంది. అయినా కూడా పేగులు చేతబట్టుకుని పరుగెత్తడం అక్కడున్నవారిని కలచివేసింది.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుప్పకూలిన బాధితుడు.. లొంగిపోయిన నిందితుడు

పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుప్పకూలిన బాధితుడు.. లొంగిపోయిన నిందితుడు

అన్వర్‌ను ఎలాగైనా చంపాలనే కసితో ఉన్న రియాసత్ అలీ అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. అందుకే వెంటపడి మరీ పొడిచినట్లు స్పష్టమవుతోంది. అన్వర్ వెనకాలే పరుగెత్తుకొచ్చిన రియాసత్ అలీ పోలీసులకు లొంగిపోయాడు. అయితే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించే క్రమంలో అతడు ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న అన్వర్ బంధుమిత్రులు పంజాగుట్టకు చేరుకుని కోపోద్రిక్తులయ్యారు. నిందితుడు రియాసత్ అలీకి చెందిన ఆటోను ధ్వంసం చేశారు.

వీపరీతమైన రద్దీతో కిటకిటలాడే పంజాగుట్ట చౌరస్తాలో ఈ ఘోరం జరగడం హాట్ టాపికయింది. వాహనదారులు, పాదచారులు, వివిధ పనుల నిమిత్తం అక్కడకు వచ్చిన జనాలు.. ఈ హత్యోదంతం చూసి ప్రాణభయంతో పరుగులు తీశారు.

అవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపంఅవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపం

 తన భార్యకు ఎయిడ్స్ రక్తం ఎక్కించబోయాడని చంపేశా..!

తన భార్యకు ఎయిడ్స్ రక్తం ఎక్కించబోయాడని చంపేశా..!

అన్వర్‌పై అంతలా కక్ష సాధించి దారుణంగా చంపడానికి నిందితుడు వెర్షన్ వేరేలా ఉంది. తన భార్యకు ఎయిడ్స్ రక్తం ఎక్కించడానికి అన్వర్ ప్రయత్నిస్తున్నట్లు రియాసత్ అలీ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అతడు చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణమా లేదంటే డబ్బుల విషయంలో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అదలావుంటే మృతుడు అన్వర్‌కు ముగ్గురు మగ పిల్లలు.. నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు సమాచారం.

English summary
An autorickshaw driver was stabbed to death in full public view, a few metres away from the Punjagutta police station, by another auto driver late evening on Wednesday. A financial dispute and illegal affair is believed to have led to the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X