హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయోధ్య తుది తీర్పు: తండ్రి మాటను జవదాటని ఎంపీ ఓవైసీ.. మీడియాలో వైరల్‌గా..

|
Google Oneindia TeluguNews

దేశ రాజకీయాల్లో హైదరాబాద్ ఎంపీకి ఎలాంటి స్టాండ్ తీసుకొన్నా.. వ్యక్తిగత, కుటుంబ విషయాల వరకు వస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదురించేందకు పూనుకొంటారనే విషయం హైదరాబాద్ రాజకీయ రంగంపై వినిపిస్తుంటుంది. తండ్రి సలావుద్దీన్ రాజకీయ సిద్దాంతాలకు, నిర్ణయాలకు, ఆయన వ్యూహరచనలను జూనియర్ ఓవైసీ విశేషంగా గౌరవిస్తారని చెప్పుకొంటారు. తాజాగా తండ్రిపై ఉండే భక్తి, భయం, వినయానికి గుర్తుగా ఓవైసీ ఆచరిస్తున్న ఓ సంఘటన అయోధ్యపై సుప్రీం కోర్టు తుది తీర్పులో వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఓవైసీ బంగ్లా

ప్రస్తుతం ఓవైసీ బంగ్లా

బాబ్రీ మసీద్ కూల్చివేత అంశంపై ఢిల్లీలో 1993లో న్యాయపోరాటం మొదలైంది. అప్పటి నుంచి ఈ వివాదంలో ముస్లిం పిటిషనర్లకు 34 అశోక్ మార్గ్‌లోని ఓవైసీ బంగ్లా ఆశ్రయంగా మారింది. అయితే ఈ వివాద అంశంపై మతపరంగాను, రాజకీయ పరంగాను ఎలాంటి స్పష్టమైన అభిప్రాయం ఆయనకు లేకపోయినా.. ఈ అంశంపై ప్రధాన పిటిషనర్ జాఫర్యాబ్ జిలానీకి ఓవైసీ ఆశ్రయం కల్పించడం తాజాగా మీడియాలో హైలెట్ అయింది.

తండ్రి మాటకు కట్టుబడి

తండ్రి మాటకు కట్టుబడి

బాబ్రీ మసీదు, రామజన్మభూమి అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న జిలానీకి ఆశ్రయం, సహకారం అందించాలనే తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఒక్కమాటకు కట్టుబడి ఎంపీ అసదుద్దీన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి నుంచి జిలానీకి ఎలాంటి సహకారం కావాల్సి వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ సహకారం అందిస్తారు అని ఓ ఆంగ్ల దినపత్రిక ది ప్రింట్ కథనాన్ని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా జిలానికి అసదుద్దీన్ ఓవైసీ న్ని రకాలు సహాయం అందిస్తున్నారు.

సొంత ఎజెండాను పక్కన పెట్టి

సొంత ఎజెండాను పక్కన పెట్టి

రామజన్మభూమి, అయోధ్య వివాదాస్థలానికి సంబంధించి ఓవైసీ ఎలాంటి ఎజెండా లేకుండా మధ్యస్థంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ తండ్రి మాట కోసం సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ జిలానీకి మాట తప్పుకుండా సహాయం అందిస్తున్నాడు. ఇటీవల ఓవైసీ మాట్లాడుతూ.. మా నాన్న సలావుద్దీన్ ఓవైసీకి జిలానీ జీ గొప్ప స్నేహితుడు. హైదరాబాద్ సంస్కృతికి విరుద్దంగా వ్యవహరించను. అలా అతిథుల గురించి మాట్లాడితే మా పెద్దల గౌరవానికి భంగం వాటిల్లుతుంది అని అన్నారు.

చివరి అంకానికి ఆయోధ్య వివాదం

చివరి అంకానికి ఆయోధ్య వివాదం

సుప్రీం కోర్టు తుది విచారణ జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని అసదుద్దీన్ అధికార నివాసం జిలాని, అతని అనుచరులతో కిక్కిరిసిపోయింది. అయితే ఇందులో మత, రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండి ఓవైసీ తన తండ్రి మాటకు విలువనివ్వడం గొప్ప విషయంగా మారింది. అయోధ్యలో రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణం అంశంపై గత దశాబ్దాలుగా కోర్టులో పోరాటం జరుగుతున్నది. ఈ అంశంపై రెండు వర్గాలు చీలిపోయి తమ వాదనలకు పదను పెడుతున్నారు. ఇలాంటి వివాదాస్పద అంశాల మధ్య ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ మాటకు మాత్రం కట్టుబడి ఉండటం మీడియాలో చర్చనీయాంశమైంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు విచారణ చివరి అంకానికి చేరుకొన్న సంగతి తెలిసిందే.

English summary
AIMIM chief and Hyderabad MP Asaduddin Owaisi stands for his promise made to his father Salahuddin Owaisi. He has been helping to Zafaryab Jilani, who is complainant in Supreme Court over the Babri demolition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X