హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Ayodhya verdict : శాంతి, గౌరవం మరింత వ్యాప్తి చెందాలి .. ట్వీట్ చేసిన మంచు లక్ష్మి

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అటు రాజకీయ నాయకులు, ఇటు ఆధ్యాత్మిక గురువులు, పలువురు పారిశ్రామిక ప్రముఖులు, సినీ వర్గాల వారు స్పందిస్తున్నారు. అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తున్న ప్రతి ఒక్కరూ భారతదేశంలోని ప్రజలు అందరు కలిసి ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఐకమత్యంతో జీవించాలని తమ సందేశాలను తెలియజేస్తున్నారు.

ఇక అయోధ్య వివాదం పై సుప్రీం ధర్మాసనం తీర్పుపై టాలీవుడ్ నటి, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ కూడా స్పందించారు. ఆమె తన భావనను ట్వీట్ ద్వారా తెలియజేశారు.' మన దేశంలో శాంతి, గౌరవం మరింత వ్యాప్తిచెందాలి అని మంచు లక్ష్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతదేశాన్ని ఇతర దేశాల కంటే చాలా అందంగా తీర్చిదిద్దేది మన దేశ వైవిధ్యం మరియు సమగ్రత' అని అవి చాలా గొప్పవి అంటూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి.

 Ayodhya verdict.. May peace and dignity spread more and more .. tweeted Manchu Lakshmi

ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా అయోధ్య తీర్పుపై చాలా జాగ్రత్తగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రగిలే కుండా అటు ప్రభుత్వమే కాకుండా ఇటు ప్రజలు సైతం, ప్రముఖులు సైతం ప్రస్తుతానికి తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం దొరకని సమస్యలా ఉన్న అయోధ్య వివాదానికి ఈరోజు ముగింపు పలకడం, తుది తీర్పును వెల్లడించడం పట్ల ఒక శాంతి కాముక వాతావరణం ప్రస్తుతానికి కనిపిస్తుంది.

English summary
Tollywood actress Mohan Babu daughter Manu Lakshmi also reacted to the Supreme Court verdict on the Ayodhya controversy. "We have to spread peace and dignity in our country," Manchu Lakshmi said on Twitter. What makes India more beautiful than other countries is that our country's diversity and integrity are so great.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X