హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగారెడ్డిలో మిస్సైన పాప సేఫ్.. ఎత్తుకెళ్లింది కూడ , పిల్లలు లేని తల్లిదండ్రులే !

|
Google Oneindia TeluguNews

మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో మిస్సయిన పాప ఆచూకి లభించింది. పాపను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని శివనగర్ కు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులు ఎత్తుకెళ్లారు.కేసు విచారణ అనంతరం పోలీసులు పాప అచూకి కనుక్కొని పాపను తన స్వంత తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే పాపను ఎత్తుకెళ్లిన వారు పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సభ్యులు కాదు .వారు కూడ పిల్లల కోసం పరితపించే తన కూతురు కోసం వారం రోజుల పాపను తీసుకెళ్లారు. అయితే వారినుండి పాపను తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.

 సంగారెడ్డిలో మాయామైన పాప కామారెడ్డిలో...

సంగారెడ్డిలో మాయామైన పాప కామారెడ్డిలో...

మూడు రోజుల క్రితం సంగారెడ్డి మాతాశిశు ఆసుపత్రిలో మిస్సయిన వారంలో పాప ఆచూకి లభించింది. పాపను పోలీసులు తల్లిదండ్రులు అప్పగించారు. ఆసుపత్రిలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శివారులోని శివనగర్‌కు చెందిన బంగారు శోభ,సంతోష్ దంపతులు పాపను ఎత్తుకెళ్లారు. మూడు రోజుల నుండి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముందుగా సీసీ టీవీ ఫుటెజీని పరీశీలీంచిన పోలీసులకు నిరాశే ఎదురయింది. అయితే మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో ఎవరైన పిల్లలను దత్తత ఇస్థారా అనే సమాచారంతో పోలీసులు కూపి లాగారు దీంతో పాపను కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఎత్తుకెళ్లినట్టు తెలవడంతో ఈరోజు ఉదయం పోలీసులు తల్లిదండ్రులను తీసుకెళ్లి చూపించారు. దీంతో పాపను గుర్తించిన వారు తమ పాపే అంటూ గుండెకు హత్తుకున్నారు. దీంతో కుటుంభ సభ్యులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 తన బిడ్డకు బ్రతికించుకునేందుకు మరోబిడ్డ అపరహరణ

తన బిడ్డకు బ్రతికించుకునేందుకు మరోబిడ్డ అపరహరణ

అయితే సంగారెడ్డి ఆసుపత్రి నుండి పాపను ఎత్తుకెళ్లిన వారు దొంగలు కాదు, పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అంతకన్నా కాదు. వాళ్లు కూడ ఓ సాధరణ కుటుంభానికి చెందినవారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లోని శివనగర్ కు చెందిన బంగారు సంతోష్ ,శోభలు దంపతులు,వారికి కూడ పెళ్లైన తర్వాత ఓ బాబు పుట్టి ఏడు నెలలకే చనిపోయాడు. అనంతరం మరోసారి గర్భవతి అయిన తర్వాత పదహారు రోజుల క్రితం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి పాప పుట్టి ఆమే కూడ అనూహ్యంగా మృతి చెందింది. దీంతో శోభ విపరీతమైన శోకసముద్రంలో మునిగి పోయారు. ఒక దశలో శోభ పిల్లలు లేక చనిపోతుందా అన్నట్టు పరిస్థితి తయారైంది.

ఇద్దరు పిల్లలు చనిపోయిన.. తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం పాప అపహరణ

ఇద్దరు పిల్లలు చనిపోయిన.. తమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం పాప అపహరణ

ఇది గమనించిన శోభ తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోంచించారు తమ బిడ్డకు ఎలాగైన పిల్లలను తెచ్చివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే తెలిసిన ఆసుపత్రుల వద్ద అప్పుడే పుట్టిన పిల్లలను ఎవరైన దత్తత ఇస్తారా అంటూ ఆసుపత్రుల చుట్టు తిరిగారు. ఈనేపథ్యంలోనే సంగారెడ్డి మాతశిశు సంరక్షణ ఆసుపత్రికి కూడ వచ్చారు. అలా వెతుకున్న సంధర్భంలోనే కల్పకూరుకు చెందిన మాధవి,మల్లేశంలకు పట్టిన పాపకు జాండీస్ రావడంతో చికిత్స అందిస్తున్నారు. వారి బిడ్డను అనూహ్యంగా ఆయా ఇవ్వడంతో అదే అదనుగా పాపను తీసుకెళ్లారు. దీంతో విషయాన్ని గమనించిన మాధవి కుటుంభ సభ్యులు ఆందోళన బాట పట్టారు.

భాదితురాలికి కూడ పదేళ్ల తర్వాత సంతానం

భాదితురాలికి కూడ పదేళ్ల తర్వాత సంతానం

సంగారెడ్డి జిల్లా మాతశిశు సంక్షేమ ఆసుపత్రిలో కల్పకూరు గ్రామానికి చెందిన మాధవి, మల్లేశం లకు వారం రోజుల క్రితం ఓ పాప జన్మించింది. అయితే ఆ పాపకు జాండీస్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే రోజులాగే పాపను చికిత్స కోసం ఆసుపత్రి ఆయాకు మాధవి అప్పగిచ్చింది. కాసేపటి తర్వాత పాప ఏడుస్తుండడంతో తిరిగి తల్లికి అప్పగించేందుకు తీసుకువచ్చిన ఆయా తల్లి మాధవికి కాకుండా ఇతర మహిళకు ఇచ్చి వెళ్లిపోయింది. అయితే పాపను తీసుకున్న మహిళ నేరుగా బయటకు వెళ్లిపోయింది. దీంతో అసలు తల్లిదండ్రులు పాప కోసం వెతకడంతో కనిపించలేదు.దీంతో పోలీసులు కేసు బుక్ చేసుకుని విచారణ చేపట్టారు.

తన తల్లిదండ్రులను ఏమి చేయవద్దని శోభ వేడుకోలు

తన తల్లిదండ్రులను ఏమి చేయవద్దని శోభ వేడుకోలు

కాగా పాపను ఎత్తుకెళ్లిన శోభ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో శోభ కన్నీరు మున్నీరవుతోంది. తనకోసమే తన తల్లిదండ్రులు పాపను తీసుకొచ్చారని తను ఎక్కడ ఇబ్బందిపడతానో అని వారు ఈ పని చేశారని అంతేకాని వారు నిజంగా పిల్లలను తీసుకురావాలనే ఉద్దేశ్యం లేదని ఏడూస్తూ తన గోడును వెళ్లబోసుకుంది. ఈనేపథ్యంలో తన తల్లిదండ్రులను పోలీసులు విడిచిపెట్టాలని వేడుకుంటుంది.

English summary
A baby girl found at kamareddy who missed in mata shishu hospital in sangareddy.girl baby was born a weekago. However, the baby is being treated at the hospital with the jaundice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X