హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

viral video:చెంబులో చిరుత కూన.. తెలియక వెళ్లిన నేత, తెలిసి పరుగో పరుగు..

|
Google Oneindia TeluguNews

చెంబులో మూగజీవి తల ఇరకడం మాములే.. క్యాజువల్‌గా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అయితే ఓ చిరుత కూన తల ఇరికింది. చూడడానికి చిరుత/ పిల్లి ఒకేలా ఉంటాయి. ఆ విషయం తెలియక ఓ నేత ముందుకెళ్లాడు. రోడ్డు మీద వెళ్తున్న ఆ మూగజీవి అవస్థను వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి గమనించారు. అది పిల్లి అని భావించిన ఆయన మానవతా దృక్పథంతో సాయం చేయాలని అనుకున్నారు. తన వాహనం ఆపి రోడ్డుపై వెళ్తున్న మూగజీవి వద్దకు చేరుకున్నారు.

మెల్లగా వెళ్లి.. పట్టుకొని

మెల్లగా వెళ్లి.. పట్టుకొని

నెమ్మదిగా రోడ్డుపై వెళ్తున్న మూగ జీవిని ఫాలో అయ్యారు. వెనకాల నుంచి వెళ్లి దాని పట్టుకున్నారు. చెంబులో నుంచి దాని తలను వేరుచేయాలని చూశారు. కానీ అప్పుడే అది పిల్లి కాదని.. చిరుత పులి అని తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే ఒక్కసారిగా దాని చేతుల్లో నుంచి కిందకు వదిలేశారు. ఈ క్రమంలో కొండా రాఘవరెడ్డి చిన్నగాయమైనట్టు సమాచారం. చిరుతపులి పిల్ల అని తెలియడంతో కొండా రాఘవరెడ్డి, అతని అనుచరులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొండా రాఘవరెడ్డి చేతిలో నుంచి కిందపడిపోయిన పులి పిల్ల కూడా అక్కడ నుంచి పొదల్లోకి పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

చిరుతపులి పిల్ల

చిరుతపులి పిల్ల

చిరుతపులి పిల్లి సంచారం గురించి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు కొండా రాఘవరెడ్డి సమాచారం అందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, చిరుతతోపాటు దాని పిల్లలను కూడా పట్టుకోవాలని అధికారులను కోరారు. మరోవైపు చిరుతపులి పిల్ల రక్కడంతో కొండా రాఘవరెడ్డి స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజెక్షన్ తీసుకున్నారు. కానీ కొండా.. అతని సహచరులు మాత్రం మాములుగా భయపడలేదు. చిరుత కూన అని తెలిసి పరుగు తీశారు.

పరుగో పరుగు

పిల్లి పిల్ల, చిరుత పులి పిల్ల ఒకేలా ఉంటాయి. దీంతో కొండా పోల్చుకోలేకపోయారు. సాయం చేసేందుకు ముందడుగు వేశారు. దానిని పట్టుకున్నారు.. చెంబు నుంచి తల తీశాక కానీ.. చిరుత అని పోల్చుకోలేక పోయారు. ఆ విషయం సహచరులు చెప్పారు. వెంటనే దానిని పరేసి.. పరుగు తీశారు. అక్కడి నుంచి కొండా బృందం పరుగు తీసింది.

English summary
Baby Leopard head on glass. ysrtp leader konda raghava reddy rescued. they are feel tha is cat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X