హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్‌తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే అతనికి ఇటీవలే ప్లాస్మా థెరపీ కూడా చేయగా.. కోలుకుంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆశించారు.

ఎస్సై యూసుఫ్‌కు ప్లాస్మా అవసరం అని కానిస్టేబుల్‌ సాయి కుమార్ తెలుసుకున్నారు. బక్రీద్ రోజున ప్లాస్మా దానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముస్లిం ఎస్సైకి హిందూ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేయడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. అదీ కూడా ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ కావడం విశేషం. సాయికుమార్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

bachupally sub inspector md yusuf died of coronavirus..

Recommended Video

Telangana సబ్ ఇన్స్పెక్టర్ Unique Drill Session వీడియో Gone వైరల్

యూసుఫ్‌కు ప్లాస్మా దానం చేసిన విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. భారతీయుల మతం, మానవత్వం.. హైదరాబాద్ పోలీసులు అని తెలిపారు. అయితే యూసుఫ్‌కు ప్లాస్మా ద్వారా చికిత్స చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

English summary
bachupally sub inspector md yusuf died of coronavirus today morning at hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X