హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పేరుతో ఆఫర్లా..! జ్యువెలరీ షాపులపై భజరంగ్ కన్నెర్ర.. పలుచోట్ల నిరసనలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bajrang Dal Activists Perform Wedding Of Young Lovers In Hyderabad.

హైదరాబాద్ : వాలంటైన్స్ డే జరుపుకోవడానికి వీల్లేదు అంటూ భజరంగ్ దళ్ హెచ్చరించింది. ప్రేమికుల రోజు జంటలు కనబడితే పెళ్లిళ్లు చేస్తామని స్పష్టం చేసింది. ఆ క్రమంలో లవర్స్ డే ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనకు దిగారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. వాలంటైన్స్ డే ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 60 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమికుల రోజు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు.

అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్ (వీడియో)అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్ (వీడియో)

పంజాగుట్టలో భజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జ్యువెలరీ షాపుల ఎదుట వారు నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వాలంటైన్స్ డే సందర్బంగా బంగారం కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటిస్తూ.. పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తున్నారంటూ ఆందోళనకారులు ధ్వజమెత్తారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 bajrang dal protest on valentines day attacked jewellery shops

ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో కనిపించిన జంటలను అడ్డుకున్నారు. నిజమైన ప్రేమికులైతే ఇలా పార్కుల వెంబడి తిరగడమేంటని ప్రశ్నించారు. మీది నిజమైన ప్రేమే ఐతే పెళ్లి చేసుకోండంటూ సూచించారు. ఆ క్రమంలో మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో భజరంగ్ దళ్ కార్యకర్తలకు తారసపడ్డ ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఆ వివాహ తంతును వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ జంట ఫిర్యాదు మేరకు భజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసు నమోదైనట్లుగా సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసినట్లు తెలుస్తోంది.

వాలంటైన్స్ డే ను వ్యతిరేకిస్తూ.. నల్లగొండ జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మిర్యాలగూడలో ప్రేమికుల రోజు వేడుకలు నిర్వహిస్తున్న హోటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.

English summary
Bajrang Dal activists protested against the Valentine's Day. The rally that took place under Hyderabad LB nagar Police Station led to tensions. About 60 activists were arrested by police. The police blocked Bajarang Dal activists in the Panajagutta protesting against the jewelery shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X