హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ !!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో ఫోర్జరీ రాయుళ్ళు పెరిగిపోయారు. ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమ సంపాదనకు తెరతీసిన వైట్ కాలర్ నేరస్తులపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది . మొన్నటికి మొన్న తన సంతకాన్ని, తన లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేశారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత హోం మంత్రికి , డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదుతో ఒక టీడీపీ నేతపై కేసు నమోదు చేస్తే ఇక ఏపీ సీఎం జగన్ సతీమణి వై ఎస్ భారతి పీఏ అని చెప్పి మోసం చేసిన కేటుగాడిపై కేసు నమోదు చేశారు పోలీసులు . ఇక తాజాగా ఫోర్జరీ రాయుళ్ళ ఎఫెక్ట్ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య కు తాకింది.

వైసీపీ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిన టీడీపీ నేత: అరెస్ట్ చేసిన పోలీసులువైసీపీ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిన టీడీపీ నేత: అరెస్ట్ చేసిన పోలీసులు

వసుంధర సంతకం ఫోర్జరీ చేసి ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కు అప్లై

వసుంధర సంతకం ఫోర్జరీ చేసి ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కు అప్లై

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె ఖాతాలో డబ్బు కాజెయ్యాలని ప్లాన్ చేసిన ఓ వ్యక్తి పై పోలీసులు సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు. బాలయ్య సతీమణి వసుంధరకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కు అప్లై చేశాడు సదరు కేటుగాడు. ఇక దీనికి సంబంధించి తమకు ఏం సంబంధం లేదని వసుంధర చెప్పటంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

బంజారా హిల్స్ శాఖలో మేనేజర్ కాల్ తో విషయం వెలుగులోకి

బంజారా హిల్స్ శాఖలో మేనేజర్ కాల్ తో విషయం వెలుగులోకి

ఇక అసలు విషయానికి వస్తే బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్ ఎమ్మెల్యే బాలకష్ణ సతీమణి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ కి అప్లై చేశారని తెలిసి ఈ నెల 13న వసుంధరకు ఆ విషయం కన్ఫార్మ్ చేసుకోటానికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన వారు, అకౌంట్‌ నంబర్‌ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు.

తను ఏ మొబైల్ బ్యాంకింగ్ కోసం అప్లై చెయ్యలేదని చెప్పిన వసుంధర

తను ఏ మొబైల్ బ్యాంకింగ్ కోసం అప్లై చెయ్యలేదని చెప్పిన వసుంధర

అయితే తాము ఏ మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని బాలయ్య సతీమణి వసుంధర తెలిపారు. తనకు సంబంధించి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని వసుంధర స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయంపై ఆరా తీశారు. కొత్తగా వచ్చిన బ్యాంకులో పని చేస్తున్న కొర్రి శివ అనే అకౌంటెంట్ ఈ చర్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బుల కోసం కక్కుర్తి పడిన సదరు అకౌంటెంట్ ఈ పని చేసినట్టు గుర్తించారు.

ప్రముఖులను టెన్షన్ పెడుతున్న ఫోర్జరీ రాయుళ్ళు

ప్రముఖులను టెన్షన్ పెడుతున్న ఫోర్జరీ రాయుళ్ళు

దీనిపై అతడిని నిలదీయగా మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించినట్టు తెలుస్తుంది. దీంతో వసుంధరకు సంబంధించిన లావాదేవీలు చూసే మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ అకౌంటెంట్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల డిజిటల్ చెల్లింపుల నేపధ్యంలో వీళ్ళు , వాళ్ళు అన్న తేడా లేకుండా ఎవరి మీద అయినా సరే సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఫోర్జరీ రాయుళ్ళు ప్రముఖులను టెన్షన్ పెడుతున్నారు .

English summary
Police have registered a case under cybercrime against a man who forged the signature of veteran actor, Hindupuram MLA Balakrishna wife Vasundhara, for allegedly forging money into her account. With the name of Balayya wife Vasundhara an accountant applied for a mobile banking application in a private bank with the signature of Forgery. Vasundhara said she had nothing to do with the incident and the police had registered a criminal case against the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X