హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బట్టెబాజ్ మాటలొద్దు.. బండి సంజయ్‌పై బాల్క సుమన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఉద్యోగాల రగడ నెలకొంది. ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని విపక్షాలు దాడి చేస్తుంటే.. ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చామని టీఆర్‌ఎస్ సర్కార్ అంటోంది. ఉద్యోగాల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన కేటీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని సుమన్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో డీకే అరుణ ఎక్కడున్నారని సుమన్ సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం ఆంధ్రపాలకుల దగ్గర ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆమె త్యాగాల గురించి మాట్లాడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

balka suman slams bandi sanjay

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. బట్టేబాజ్ మాటలు బంద్ పెట్టు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో లెక్కలతో సహా చెప్పామని.. లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి కేటీఆర్ లేఖ విడుదల చేసినట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వివరాలతో సహా ప్రశ్నలు సంధించారు.

2014 ఎన్నికల ప్రచారంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ చెప్పిందని.. ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని బాల్క సుమన్ అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు.

English summary
trs mla balka suman slams bjp state president bandi sanjay on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X